పేమెంట్ సొల్యూషన్ కంపెనీ రేజర్ పే నూతనంగా పేమెంట్ పేజెస్ అనే సర్వీసును ప్రారంభించింది. అన్ని రకాల వ్యాపారస్తులు ఆన్‌లైన్ చెల్లింపులను స్వీకరించేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపింది.
బెంగళూరు: పేమెంట్ సొల్యూషన్ కంపెనీ రేజర్ పే నూతనంగా పేమెంట్ పేజెస్ అనే సర్వీసును ప్రారంభించింది. అన్ని రకాల వ్యాపారస్తులు ఆన్‌లైన్ చెల్లింపులను స్వీకరించేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపింది.
ఎలాంటి ఇంటిగ్రేషన్, నిర్వహణ ఛార్జీలు లేదా స్థిర ఫీజుల అవసరం ఇందులో ఉండదని స్పష్టం చేసింది. దేశ జీడీపీలో 30 శాతం వాటా కలిగిన చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల్లో 68శాతం మంది వెబ్ పోర్టళ్లు కానీ, యాప్స్ కానీ లేవని తెలిపింది.
ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇది ఎక్కువ ఉందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆయా వ్యాపారులకు పేమెంట్ పేజీని ఐదు నిమిషాల వ్యవధిలోపే రేజర్ పేమెంట్ పేజెస్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఈ షేరబుల్ లింక్ ద్వారా ఏర్పడే ఈ పేజీని పలుమార్లు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.