ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వన్ ప్లస్ 7టీ

By narsimha lode  |  First Published Sep 27, 2019, 1:23 PM IST

చైనాకు చెందిన మొబైల్ కంపెనీ వన్ ప్లస్ మరో స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది,


న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌.. మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వన్‌ప్లస్‌ 7టీ పేరిట కొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన వన్‌ప్లస్‌ 7కి కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చారు. 

ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో లబించనుంది. 8జీబీ విత్128జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధరను రూ.37,999గా, 8 జీబీ విత్ 256 జీబీ వేరియంట్‌ ధరను రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. 

Latest Videos

undefined

కొత్త ఫోన్‌ 6.55 అంగుళాల ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లేతో లభించనున్నది. దీంతో ఫోన్‌లో రంగులు అత్యుత్తమంగా కనిపించడమే కాక బ్లూ లైటింగ్‌ 40 శాతం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ 10 ఓఎస్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. ఆక్సిజన్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. 

ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 3,800 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ, 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు 12 ఎంపీ టెలీఫొటో లెన్స్‌తో అందుబాటులోకి తెచ్చారు. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండనున్నది. 

మెరుగైన చార్జర్‌ వల్ల వన్‌ప్లస్‌ 7ప్రోతో పోలిస్తే కొత్త ఫోన్‌ 18 శాతం వేగంగా చార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది. ముందూ వెనుక కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ అందిస్తున్నారు.

బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌తో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఫ్రాస్టెడ్‌ సిల్వర్‌, గ్రాసియర్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది. శుక్రవారం నుంచి వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌, అమెజాన్‌.ఇన్‌, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది.
 

click me!