మేం సైతం: కాన్సెప్ట్ ఫోన్ రిలీజ్ చేసిన షియోమీ.. ధర రూ.2 లక్షలు

By Nagaraju penumalaFirst Published Sep 26, 2019, 11:42 AM IST
Highlights

చైనా బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ మిగతా ఫోన్ల మాదిరిగా 108 మెగా పిక్సెల్ కెమెరాను ఆవిష్కరించింది. ‘ఎంఐ మిక్స్ ఆల్ఫా‘ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.2 లక్షలుగా నిర్ణయించింది.

బీజింగ్: బడ్జెట్ ఫోన్లతో కస్టమర్లకు దగ్గరైన చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కొత్త తరహా స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించడంలో తామేం తక్కువ కాదని నిరూపించుకున్నది. ‘ఎంఐ మిక్స్ ఆల్ఫా’ పేరిట ఒక కాన్సెప్ట్ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది.

ఇప్పటివరకు ముందువైపు మాత్రమే డిస్ ప్లేతో ప్రయోగాలు చేస్తూ వస్తున్న కంపెనీలకు పోటీగా వీలైనంత వరకు మొత్తం బాడీని స్క్రీన్ కోసం ఉపయోగించి మరీ ఆశ్చర్యపరిచింది. ముందువైపు పైన, కింది భాగాల్లో చిన్న అంచులు కల ఉన్న ఈ ఫోన్‌లో బ్యాక్ కెమెరా భాగాన్ని మినహాయిస్తే మిగిలిందంతా స్క్రీన్ ఉండడం గమనార్హం.

ఫోన్ ఆన్ చేసిన ప్రతిసారి మొత్తం పని చేసే విధంగా కాక కేవలం ఫోన్ వాడే వ్యక్తి ఎటు చూస్తే అటు మాత్రమే పని చేసేలా స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం సెన్సర్లు, ఎఐ అల్గారిథమ్‌ను వినియోగించారు. ఇందులో ఫిజికల్ బటన్లు ఉండవు.

ఈ ఫోన్‌లో ఇయర్ పీస్ ఉండదు. మొబైల్ స్క్రీనే ఇయర్ పీస్‌గా పని చేస్తుంది. 40 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 5.0 ఫీచర్లు ఉన్నాయి.

ఫోన్ ధర చైనా యువాన్ల ప్రకారం 19,999 యువాన్లు. ఇది భారత కరెన్సీలో రూ.2 లక్షలు. అయితే, ఈ ఫోన్‌ను అందరికీ అందుబాటులోకి రావడం లేదు. కేవలం ఇది కాన్సెప్ట్ ఫోన్ మాత్రమే. త్వరలో వీటి ఉత్పత్తి ప్రారంభించి కొద్ది మంది విక్రయించనున్నారు.

షియోమీ సంస్థ తొలిసారి 109 మెగా పిక్సెల్ కెమెరాను వినియోగించింది. ఇది పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి నాలుగు చిన్న పిక్సెల్స్‌ను కలిసి ఒక పెద్ద పిక్సెల్‌గా తయారుచేసి మెరుగైన ఫోటోలు అందిస్తూ ఉంటుంది. 20 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, పోర్టెట్రయిట్ షాట్ల కోసం 12 మెగా పిక్సెల్స్ కెమెరాను వినియోగించారు

డ్యూయల్ సిమ్‌తో వస్తున్న ఈ ఫోన్ ఎంఐయూఐ అల్ఫా ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 7.92 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ (2088x2250)తో వస్తున్నది. స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ ర్యామ్ సామర్థ్యంతో వస్తున్నది. 4050 ఎంఎహెచ్ బ్యాటరీని వినియోగించారు.

click me!