డీజిల్, పెట్రో కార్ల విక్రయాలకు షాక్: విద్యుత్ వెహికల్స్ సేల్స్‌లో నార్వే రికార్డు

By rajesh yFirst Published Apr 8, 2019, 5:18 PM IST
Highlights

విద్యుత్ వాహనాల వినియోగంపై నార్వేలో బాగానే సానుకూల వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తున్నది. మార్చి నెలలో అమ్ముడైన నూతన కార్లలో 60 శాతం విద్యుత్ వాహనాలు ఉన్నాయని నార్వేయన్ రోడ్ ఫెడరేషన్ (ఎన్ఆర్ఎఫ్) పేర్కొంది. 2025 నాటికి పెట్రోల్, డీజిల్ వినియోగ కార్లకు స్వస్తి పలకాలన్న లక్ష్యంతో నార్వే ముందుకు సాగుతున్నది. బ్యాటరీ అనుసంధాన ఇంజిన్లు వాడుతున్న కార్లపై పన్ను మినహాయింపునిస్తున్నారు. 
 
ఫలితంగా టెల్సా, నిసాన్, టయోటా, డామ్లేర్ వంటి సంస్థల కార్ల విక్రయాలు దెబ్బ తిన్నాయి. గతేడాది నార్వేలో విద్యుత్ కార్ల విక్రయాలు 31.2 శాతం పెరిగాయి. 2017లో అది 20.8 శాతంగా ఉంది. మార్చి నెల విక్రయాల్లో 58.4 శాతం విద్యుత్ వాహనాలే. 

యూరోయన్ దేశాల్లో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా నార్వేగా నిలుస్తున్నది. వ్యక్తిగత విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో నార్వే రికార్డు స్థాయిలోనే నిలిచింది. తద్వారా పూర్తి గ్రీనరీ ఆర్థిక వ్యవస్థ దిశగా నార్వే అడుగులు వేస్తున్నది. 

అంతర్జాతీయ ఇంధన సంస్థ గణాంకాల్లో హైబ్రీడ్, విద్యుత్ కార్ల తయారీ సంస్థ (ఐఈఏ) అంచనాల ప్రకారం నార్వే రెండోస్థానంలో నిలిచింది. 12 శాతం కార్ల సేల్స్ తో ఐస్ లాండ్ మూడవ, ఆరు శాతం విక్రయాలతో స్వీడన్ నాల్గవ స్థానంలో నిలిచాయి. 

2017లో చైనాలో విద్యుత్ కార్ల విక్రయాలు 2.2 శాతం కాగా, అగ్రరాజ్యం అమెరికాలో కేవలం 1.2 శాతం మాత్రమే. అయితే 2019లో ఇప్పటి వరకు జరిగిన అమ్మకాల్లో 50 శాతం విద్యుత్ వాహనాలేనని నార్వేయన్ ఎలక్టిక్ వెహికల్స్ అసోసియేషన్ (ఎన్ఈవీ) తెలిపింది. 

నెల వారీగా అమ్మకాల్లో తేడాలు ఉన్నాయన్నది. అయితే ఈ ఏడాది కొనుగోళ్లలో 50 శాతం విద్యుత్ వాహనాలేనని, ఇది అద్భుతమైన అంశమని ఎన్ఈవీ ప్రధాన కార్యదర్శి క్రిష్టినా బూ తెలెలిపారు. 
 
click me!