బడ్జెట్ ధరకే ఒకేసారి ‘లెనోవో’ మూడు ఫోన్లు విపణిలోకి

By narsimha lode  |  First Published Sep 6, 2019, 11:57 AM IST

చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో కంపెనీ ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లను భారత విపణిలోకి తెచ్చింది. 


న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో కంపెనీ ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లను భారత విపణిలోకి తెచ్చింది. లెనోవో ఏ6నోట్, లెనోవో కే10 నోట్, లెనోవో జడ్‌6 ప్రొలను అందుబాటులోకి తెచ్చా మని లెనోవో ఇండియా తెలిపింది. ఏ6 నోట్‌ ధర రూ.7,999 అని లెనోవో ఇండియా ఎండీ ప్రశాంత్‌ మణి చెప్పారు. 

కే10 నోట్‌లో 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఫోన్‌ ధర రూ.13,999 అని, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ.15,999 అని పేర్కొన్నారు. ఇక జడ్‌6 ప్రొలో 8 జీబీ విత్ 128 జీబీ ర్యామ్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.33,999 అని వివరించారు. 

Latest Videos

undefined

ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 5–7% రేంజ్‌లో పెరగగలవని అంచనాలున్నాయని ఎమ్‌డీ ప్రశాంత్‌ మణి చెప్పారు. కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ ద్వారా భారత్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీ చేపట్టామని,  భారత్‌ నుంచి ఎగుమతులూ మొదలు పెట్టామని తెలిపారు.

ప్రధానంగా ప్రీమియం మోడల్‌  జెడ్‌ 6 ప్రొ లో 6.39 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను, 12 జీబీ ర్యామ్‌, వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీతో పాటు, నాలుగు కెమెరాలను, 27 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అమర్చింది.

లెనోవో జడ్ 6 ప్రొ వేరియంట్ ఫోన్‌లో 6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ గల ఈ ఫోన్‌ 
ఆండ్రాయిడ్ 9.0పైతో పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల ఈ ఫోన్‌లో 48+16+ 8+ 2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా, 
32 ఎంపీ  సెల్ఫీ  కెమెరా ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ,
ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని సొంతం.  

లెనోవో కే10 నోట్‌ వేరియంట్ ఫోన్ 6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ‘ఆండ్రాయిడ్ 9.0పై’తో ఈ ఫోన్ పని చేస్తుంది. 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం దీని సొంతం. 16+ 8+5 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4050 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చారు. 

లేనోవో ఏ 6 నోట్‌ వేరియంట్ ఫోన్ 6.09 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే తోపాటు మీడియా టెక్‌ హీలియో పీ 22 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ’తో పని చేసే ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్ విత్ 32జీబీ స్టోరేజ్ సామర్థ్యం దీని సొంతం. ఇంకా 13+ 2 ఎంపీ రియర్‌ డ్యుయల్‌ కెమెరాతోపాటు 5ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఇంకా 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కూడా ఉంది. 

ఇక ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన  ఆఫర్స్‌ను కంపెనీ అందివ్వనుంది. అలాగే రూ.1500 విలువైన మేక్ మై ట్రిప్, రూ.2వేల విలువైన జూమ్ కార్ కూపన్లు జియో నుంచి లభిస్తాయి. అందుకు యూజర్లు రూ.299 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

click me!