నేడే శామ్‌సంగ్ గెలాక్సీ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

Published : Sep 06, 2019, 11:49 AM ISTUpdated : Sep 06, 2019, 11:52 AM IST
నేడే శామ్‌సంగ్ గెలాక్సీ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

సారాంశం

శామ్‌సంగ్ గెలాక్సీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది

న్యూఢిల్లీ: ప్రముఖ దక్షిణ కొరియా మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. శుక్రవారం శామ్‌సంగ్ గెలాక్సీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫోన్ ధర మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ ఎనిమిదేళ్లుగా ఈ ఫోన్‌‌ను రూపొందిస్తోంది.

ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి ఈ ఫోన్‌ను విడుదల చేసిన కొన్ని రోజులకే ఫోన్ స్క్రీన్ సమస్య మొదలైంది. స్క్రీన్‌లో సమస్యలు తలెత్తడంతో ఫోన్ విడుదలను కొన్నాళ్లపాటు నిలిపివేశారు. జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో హైస్పీడ్ 5జీ నెట్‌వర్క్‌తో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. 

ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్‌లో 1980 డాలర్లుగా పలుకుతోంది. ఈ నెల 27వ తేదీన అమెరికా విపణిలో అడుగు పెట్టనున్న శామ్ సంగ్ 12 జీబీ విత్ 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం, 7.3 అంగుళాల ఇంటర్నల్ ఫ్లెక్సిబుల్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
 

PREV
click me!

Recommended Stories

Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!