టెలికం రంగంలో జియో హవా కొనసాగుతోంది. కొత్త యూజర్లను జియో పెంచుకొంటూనే ఉంది.
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో హవా కొనసాగుతోంది. జూలై నెలలో 85.39 లక్షల మంది కొత్త మొబైల్ కస్టమర్లను ఈ కంపెనీ సంపాదించుకుంది. ఇదే నెలలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు కలిసి 60 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయని ట్రాయ్ వెల్లడించింది.
జూలై చివరినాటికి జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 33.97 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ (టాటా టెలీసర్వీసెస్ నెంబర్లు సహా) 25.8 లక్షల మంది కస్టమర్లను, వొడాఫోన్ ఐడియా 33.9 లక్షల మంది కస్టమర్లను చేజార్చుకున్నాయి. బీఎస్ఎన్‌ఎల్ జూలైలో 2.88 లక్షల మంది కస్టమర్లను సంపాదించుకుంది. దీంతో కంపెనీ కస్టమర్ల సంఖ్య 11.6 కోట్లకు చేరింది. జూలై చివరినాటికి దేశవ్యాప్తంగా మొబైల్, లాండ్‌లైన్ వినియోగదారుల సంఖ్య 118.9 కోట్లకు చేరుకుంది. ఇది స్వల్పంగా 0.2 శాతం పెరుగుదలగా ఉంది.
undefined
సునీల్ మిట్టల్ సారథ్యంలోని ఎయిర్ టెల్ 25.8 లక్షల మొబైల్ యూజర్లరు, వొడాఫోన్ ఐడియా 33.9 లక్షల వినియోగదారుల బేస్ కోల్పోయింది. వేతనాల చెల్లింపుల్లో జాప్యం సమస్య తలెత్తినా బీఎస్ఎన్ఎల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పెంచుకోవడం గమనార్హం. టెలిఫోన్ సబ్ స్క్రైబర్ల సంఖ్య ఇటు గ్రామీణం, అటు పట్టణ ప్రాంతాల్లోనూ పెరిగిపోవడం గమనార్హం. పట్టణ ప్రాంత సబ్ స్క్రైబర్ల సంఖ్య 67.8 కోట్లకు చేరితే గ్రామీణ ప్రాంతంలో అది 51.1 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది. జూలై నెలాఖరు నాటికి టెలిఫోన్ సబ్ స్క్రైబర్ల సాంద్రత 90.23 శాతానికి చేరింది.
ఇక బ్రాడ్ బాండ్ సబ్ స్క్రైబర్ల సంఖ్య 60.4 కోట్లకు చేరింది. జూన్ నెలతో పోలిస్తే జూలైలో 1.60 శాతం పురోగతి నమోదైంది. అగ్రశ్రేణి ఐదు సర్వీసు ప్రొవైడర్లు 98.95 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయని తెలిపాయి. జియో 339.79 మిలియన్ల సబ్ స్క్రైబర్లు కలిగి ఉండగా, ఎయిర్ టెల్ 123.94 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 110.92 మిలియన్ల సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నాయని ట్రాయ్ వివరించింది.