అత్యున్నత ఫీచర్లతో వన్‌ప్లస్‌ 7టీ, ప్రో: అక్టోబర్ 10న లాంచింగ్

By Nagaraju penumalaFirst Published Sep 18, 2019, 3:15 PM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ వచ్చేనెల 10వ తేదీన యూరప్ కేంద్రంగా వన్ ప్లస్ 7టీ, 7టీ ప్రో మోడల్ ఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నది. అయితే దీని ధర ఎంత అన్న సంగతి ఇంకా వెల్లడి కాలేదు.

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నూతన 7టీ స్పెసిఫికేషన్లపై గతంలో అక్కడక్కడా లీకులొచ్చాయి. తాజాగా 7టీ, 7టీ ప్రొ ఫీచర్లన్నీ పూర్తిగా వెల్లడయ్యాయి. వచ్చేనెల 10న యూరప్ కేంద్రంగా ‘7టీ’, ‘7టీ ప్రో’ ఫోన్ల ఆవిష్కరణకు వన్ ప్లస్ ఏర్పాట్లు చేస్తున్నది.

ఆ రెండు హ్యాండ్‌సెట్స్‌ పూర్తి స్పెసిఫికేషన్లు ఇవేనంటూ వన్‌ప్లస్‌ సీఈవో పెటె లావ్‌ వెల్లడించారు. ఈ హ్యాండ్‌సెట్లు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855ప్లస్‌ ప్రాసెసర్‌పై నడుస్తాయని గతంలో వచ్చిన వార్తలు వాస్తవమేనని తేలింది.

ఇక వన్‌ప్లస్‌ 7టీ 6.55 అంగుళాలతో 90హెచ్‌జడ్‌ ఏఎంఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 7టీ ప్రొ అత్యున్నత రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానున్నది. ఈ రెండు ఫోన్లల్లో 48 మెగాపిక్సెల్‌తో కూడిన మూడు కెమెరాలు ఉంటాయి.

8 మెగా పిక్సెల్‌ టెలిఫోటో, 16 మెగాపిక్సెల్‌ అల్ర్టా వీడియో కెమెరాలతో పాటు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్‌ కెమెరా అమర్చారు. ఇక సైజ్‌కు తగినట్టే వన్‌ప్లస్‌ ప్రో వేరియంట్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానున్నది.

వన్‌ప్లస్‌ 7టీ జీబీ రామ్‌తో పాటు 3800 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండగా ప్రొ 8జీబీ ర్యామ్‌, 4085 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. ఇక ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్‌ 10పై ఆక్సిజన్‌ ఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తాయి.

click me!