ఇన్‌స్టాగ్రామ్‌లో నచ్చిన పాటల్ని వినొచ్చు ఇలా!!

Siva Kodati |  
Published : Sep 18, 2019, 11:33 AM ISTUpdated : Sep 18, 2019, 11:37 AM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో నచ్చిన పాటల్ని వినొచ్చు ఇలా!!

సారాంశం

సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ అనుబంధ ఇన్‌స్టాగ్రామ్ నూతన ఫీచర్‌తో మ్యూజిక్, నచ్చిన పాటలను ఎంచుకునే వెసులుబాటు కల్పించింది.

న్యూఢిల్లీ: ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ‘ఇన్‌స్టాగ్రామ్’ నూతన ఫీచర్‌తో వినియోగదారుల ముందుకు తెచ్చింది. ఖాతాదారులు ఇక నుంచి తమకు నచ్చిన పాటలను ‘స్టోరీస్’తో జోడించే విధంగా కొత్త ఆప్షన్ తీసుకు వచ్చింది. 2018 మార్చిలోనే కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో ఇన్‌స్ట్రాగ్రామ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా తాజా అప్‌డేట్‌తో ఫీచర్‌ను పొందవచ్చు.

స్టోరీస్ ఆప్షన్‌లోకి వెళ్లి స్టిక్కర్స్ బటన్ నొక్కితే ఈ ఫీచర్ కనిపిస్తున్నది. అయినా మ్యూజిక్ ఆప్షన్ కనిపించకపోతే యాప్‌ను డిలిట్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేస్తే మీరు దాన్ని పొందొచ్చు. ఇన్‌స్టా గ్రామ్‌లో వచ్చే ఈ మ్యూజిక్‌లో ప్రజాదరణ పొందిన పాటలు, మోడ్స్, జెనర్స్ ఇలా మూడు రకాల వసతులు ఉంటాయి. వాటి ద్వారా మీకు నచ్చిన పాటల్ని బ్రౌజ్ చేసి స్టోరీస్‌కు జోడించుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?