ఎండీఓకు బెదిరింపులు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్

By narsimha lode  |  First Published Oct 6, 2019, 7:11 AM IST

నెల్లూరు జిల్లాలో ఎంపీడీఓను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి నుండి ఆదివారం నాడు తెల్లవారుజాము వరకు నెల్లూరు జిల్లాలో హైడ్రాామా చోటు చేసుకొంది.


నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నాడు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు.

శనివారం రాత్రి న్యూఢిల్లీ నుండి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయమై డీజీపీ గౌతం సవాంగ్ తో చర్చించారు. డీజీపీతో చర్చించిన తర్వాత నెల్లూరు జిల్లా పోలీసులు వేగంగా స్పందించారు.

Latest Videos

undefined

శనివారం రాత్రి నుండి భారీగా పోలీసులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే శ్రీకాంత్ రెడ్డి కుటుంబసభ్యులను పోలీసులను అడ్డుకొన్నారు.

ఆదివారం నాడు తెల్లవారుజామున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి అనుచరులు కూడ భారీగా అక్కడికి చేరుకొన్నారు.

అయితే పోలీసులు తన ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత శ్రీధర్ రెడ్డి పోలీసులకు లొంగిపోయారు. శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ఆయనను నెల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

వైఎస్ఆర్‌సీపీలోని రెండు వర్గాల మధ్య గొడవల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఎంపీడీఓ సరళ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో పాటు ఆ సమయంలో ఓ వైసీపీ నేత కూడ అక్కడే ఉన్నాడని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు కొన్ని వీడియో క్లిప్పింగ్ లను కూడ ఆయన మీడియాకు విడుదల చేశారు.

వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.శ్రీధర్ రెడ్డి మద్యం తాగి వచ్చి శుక్రవారం రాత్రి కల్లూరిపల్లిలోని తన ఇంటిపై దాదడి చేశారని సరళ ఆరోపించారు.శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన లేఅవుట్ లో సౌకర్యాలు కల్పించుకోవడానికి అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేశారని ఆగ్రహించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఇంటిపై దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

సూత్రధారులు వేరే ఉన్నారు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
 

click me!