మేమూ అలాగే చేస్తే చంద్రబాబు, లోకేశ్ లు తట్టుకోలేరు: మంత్రి అనిల్ స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jan 7, 2020, 8:30 PM IST
Highlights

తమ నాయకులపై జరుగుతున్న దాడులవెనుక చంద్రబాబు నాయుడు కుట్రలు దాగున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.  

తాడేపల్లి: వైసిపి ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, కైలా అనిల్ కుమార్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైస్సార్‌సిపి నేతలపై దాడులు చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

గతంలో టిడిపి అధికారంలో వున్న సమయంలో తమ నాయకుడు, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై అక్రమంగా కేసులు పెట్టినా సంయమనంతో ఉన్నామన్నారు.  హత్యాయత్నం చేసినా ఏనాడు తాము దాడులకు, హింసకు పాల్పడలేదన్నారు. 

అధికారం కోల్పోయి ఆరు నెలలు కాకముందే చంద్రబాబు దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గల్లీ స్థాయి నేతగా దిగజారిపోయారన్నారు. తాము దాడులకు తెగబడితే చంద్రబాబు, లోకేష్ లతో పాటు టీడీపీ నేతలు ఎక్కడా తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు. 

read more  ఆ వెధవ పని చేసింది చంద్రబాబే... రాజధానిపై ఉద్యోగ సంఘం నేత కీలక వ్యాఖ్యలు

రైతులు చంద్రబాబు మాయలో పడొద్దని మంత్రి అనిల్ సూచించారు. రైతులను అన్ని విధాలుగా అదుకోడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్దంగా వున్నారని తెలిపారు. రైతులను ఉపయోగించుకుని వైస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.

గత ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు ఇంకా సిగ్గులేకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పిన్నెలిపై వైస్సార్సీపీ నాయకులే దాడి చేసారని టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని... మరోసారి టీడీపీ నేతలు ఇలా దాడులకు దిగితే సహించబోమని మంత్రి హెచ్చరించారు.

read  more  కేసీఆర్ కే సాధ్యం కాలేదు... జగన్ కు ఎలా సాధ్యమవుతుంది: సోమిరెడ్డి

మహిళ అనికూడా చూడకుండా ఓ రిపోర్టర్ పై టీడీపీ నాయకులు దాడికి దిగారని గుర్తుచేశారు. అలాంటి పార్టీకి నాయకుడిగా వున్న చంద్రబాబు మహిళలు గురించి    మళ్లీ గొప్పలు చెపుతారని అన్నారు. మీడియా, వైస్సార్సీపీ నాయకులు మీద దాడులు చేయడం ద్వారా శాంతి భద్రతల విఘాతం కలిగించాలని చూస్తున్నారని అన్నారు. ఈ పరిణామాలు, దాడులకు పాల్పడ్డవారిపై డీజీపీకి పిర్యాదు చేస్తామని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు.

click me!