జోమాటో కేసు : పరారీలో హితేషా చంద్రాణి...!!

By AN TeluguFirst Published Mar 17, 2021, 3:39 PM IST
Highlights

జొమాటో డెలివరీ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ముక్కు పగలగొట్టాడని ఆరోపించిన హితేష చంద్రాణి బెంగళూరునుంచి పారిపోయినట్లు తేలింది. ఆరోపణలు ఎదుర్కుంటున్నజొమాటో డెలివరీ బాయ్ కామరాజ్, కస్టమర్ హితేష చంద్రాణి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. 

జొమాటో డెలివరీ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ముక్కు పగలగొట్టాడని ఆరోపించిన హితేష చంద్రాణి బెంగళూరునుంచి పారిపోయినట్లు తేలింది. ఆరోపణలు ఎదుర్కుంటున్నజొమాటో డెలివరీ బాయ్ కామరాజ్, కస్టమర్ హితేష చంద్రాణి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. 

హితేష చంద్రాణిని కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని, విచారణకు హాజరు కావాలని పోలీసులు హితేషకు నోటీస్ పంపారు. అయితే ఆమె బెంగళూరులో వదలి వెళ్లిపోయిందని, మహారాష్ట్రలోని తన ఆంటీ ఇంట్లో ఉందని తేలింది. దీంతో పోలీసులు ఆమె తిరిగి బెంగళూరు వచ్చాక తన స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు కొంత టైమ్ ఇస్తామనీ, దర్యాప్తు కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. ఆమె కనక హాజరుకాకపోతే ఆమెను అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్పారు.

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్.. తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. సదరు మహిళా కష్టమర్.. కావాలని ఆమెకు ఆమె ముక్కుపై కొట్టుకొని గాయం చేసుకుందని అతను చెప్పడం గమనార్హం. 

‘‘ఆమెకు భోజనం అందించిన తర్వాత బిల్లు చెల్లించమని అడిగాను. అంతేకాదు ట్రాఫిక్‌జాం వల్ల ఆలస్యమైందని, అందుకు నన్ను క్షమించమని కోరాను కూడా. కానీ ఆమె ఫుడ్‌ తీసుకునేందుకు నిరాకరించారు. ఎలాగోలా ఒప్పించాను. అంతలోనే ఆమె ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసినట్లు నాకు సమాచారం అందింది. దీంతో ఫుడ్‌ ప్యాకెట్‌ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాను. 

కానీ, నేను ఎంతగా అడిగినా తను సరిగా స్పందించలేదు. ఇక లాభం లేదనుకుని తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే హిందీలో తిట్టడం మొదలుపెట్టారు. నన్ను నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. ఆమె ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నేను తనపై చేయి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.  

ఇక కేసులో ఇరుక్కున్న కారణంగా చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు, తనకు ఇప్పటికే రూ. 25 వేలు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. సదరు డెలివరీ బాయ్ పట్ల కంపెనీ కూడా సానుకూలంగా వ్యవహరించింది. అతని వల్ల ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అంతలేదని.. అతని రేటింగ్ కూడా చాలా ఎక్కువ అని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తామని.. వారు పేర్కొన్నారు. 

click me!