కాన్పూర్‌లో Zika Virus కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు.. పిలల్లు కూడా ఉండటంతో టెన్షన్..

By team teluguFirst Published Nov 8, 2021, 4:09 PM IST
Highlights

దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ (Zika Virus) విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్‌(Kanpur) లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. గత వారం రోజులుగా జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ (Zika Virus) విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్‌(Kanpur) లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. గత వారం రోజులుగా జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాన్పూర్‌లో శనివారం వరకు 79 కేసులు వెలుగుచూడగా.. ఆదివారం మరో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 89కి చేరింది. అందులో 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. అయితే  2015లో బ్రెజిల్ జికా వైరస్‌ విజృంభణ కారణంగా.. వేలాది మంది పిల్లలు మైక్రోసెఫాలీతో జన్మించారు. ఈ రుగ్మత పిల్లలు అసాధారణంగా చిన్న తలలు, అభివృద్ధి చెందని మెదడులతో జన్మించడానికి కారణమవుతుంది. 

జికా కేసుల సంఖ్య పెరుగుతోంద‌ని, అనేక వైద్య బృందాలు వ్యాధిని అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కాన్పూర్ జిల్లా మెడిక‌ల్ చీఫ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ నేపాల్ సింగ్ తెలిపారు. ఒక గర్బిణి మహిళకు కూడా జికా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని.. ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. జికా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నామని చెప్పారు. వైరస్‌ను వ్యాప్తి చేసే దోమ సంతానోత్పత్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. 

Also raed: కాన్పూర్‌లో కొత్తగా మరో 25 జికా వైరస్ కేసులు.. అధికారులు అప్రమత్తం.. రెండో రౌండ్ స్క్రీనింగ్ ప్రారంభం

ఇక, కాన్పూర్‌లో అక్టోబర్ 23న తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఇండియన్ ఎయిర్‌పోర్స్‌లో పనిచేస్తున్న ఓ అధికారికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను తొలుత.. చికిత్స కోసం జిల్లాలోని ఎయిర్‌ఫోర్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే లక్షణాలు అంతుచిక్కకపోవడంతో.. రక్త నమూనాను సేకరించి సరైన పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాం. అక్కడ ఆయనకు జికా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చర్యలు చేపట్టారు. జిల్లాలో జికా వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి పలు బృందాలను కూడా నియమించినట్టుగా అధికారులు తెలిపారు. ఐఏఎఫ్ అధికారి తొలుత చికిత్స తీసుకున్న ఎయిర్‌ఫోర్స్‌ హాస్పిటల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ‌

Also read: Zika Virus: కలకలం రేపుతున్న జికా వైరస్.. కొత్తగా మరో 30 కేసులు

డిస్ జాతి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికున్ గున్యాలు కూడా ఈ దోమల ద్వారానే వ్యాపిస్తాయి. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. జికా ఇన్ఫెక్షన్‌ మరీ అంతగా ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల జికా వైరస్‌ సంబంధిత కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. 

click me!