ప్రియురాలిని చూడటానికి వస్తే.. ప్రాణాలు తీసేశారు

Published : Oct 23, 2018, 11:51 AM IST
ప్రియురాలిని చూడటానికి వస్తే.. ప్రాణాలు తీసేశారు

సారాంశం

యువతి తల్లిదండ్రులు, బంధువులు విచక్షణా రహితంగా అతనిపై దాడిచేసి.. ప్రాణాలు పోయేలా చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.  

ప్రియురాలిని చూడటానికి వచ్చిన ఓ యువకుడి ప్రాణాలు తీసేశారు.  యువతి తల్లిదండ్రులు, బంధువులు విచక్షణా రహితంగా అతనిపై దాడిచేసి.. ప్రాణాలు పోయేలా చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నామక్కల్‌ జిల్లా పళ్లికారణై సమీపంలోనున్న పెరుంపారై ప్రాంతానికి చెందిన ధర్మరాజ్‌ (27) మినీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం వెప్పడైలోనున్న ఓ ప్రైవేట్‌ మిల్లులో పనిచేసేవాడు.

 ఆ సమయంలో ఈక్కాట్టు ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17)తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. ఈ విషయం ఆమె తండ్రికి తెలిసి మందలించాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పానని, వారు వ్యతిరేకిస్తున్నారని ధర్మరాజ్‌కి సదరు బాలిక ఫోన్‌లో చెప్పి విలపించింది. శనివారం ఉదయం ధర్మరాజ్‌ ఆమె ఊరికి చేరుకున్నాడు. ధర్మరాజ్‌ను చూసిన బాలిక తండ్రి, బంధువులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచాడు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే