నా భార్య కొడుతుంది.. కళ్లలో కారం చల్లి మరీ చావబాదుతోంది.. రక్షించండి మహాప్రభో.. ఓ భర్త ఫిర్యాదు..

Published : May 25, 2022, 01:29 PM IST
నా భార్య కొడుతుంది.. కళ్లలో కారం చల్లి మరీ చావబాదుతోంది.. రక్షించండి మహాప్రభో.. ఓ భర్త ఫిర్యాదు..

సారాంశం

ఓ భార్య భర్తను చితకబాదింది. మామూలుగా కాదు కళ్లలో కారం చల్లి మరీ చావగొట్టింది. దెబ్బకు ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. రక్షించండి మహాప్రభో అంటూ కాళ్లా వేళ్లా పడ్డాడు. 

మధ్యప్రదేశ్ : Wife and husbands మధ్య గొడవలు మామూలే.. తలో మాటా అనుకోవడం.. కోపంలో ఓ దెబ్బ వేయడం, వేయించుకోవడం మామూలుగా కనిపిస్తుంటుంది. ఆ తరువాత చిన్న Conflict అయితే వాటంతట అవే సర్దుకుంటాయి. పెద్ద గొడవలైతే పెద్దల సమక్షంలో రాజీకి వస్తారు. ఇంకా ముదిరితే విడిపోయి విడిగా బతుకుతారు. ఇక సంసారంలో తాగో, పట్టలేని కోపంలోనో, పితృస్వామ్య భావజాలం నుంచో పెళ్లాలను కొట్టడం కనిపిస్తూనే ఉంటుంది. అయితే దీనికి విరుధ్దమైన ఘటన.. చిత్రం.. భళారే విచిత్రం.. అనిపించేలాంటి సంఘటన గ్వాలియర్ లో జరిగింది. 

Madhya Pradeshలోని గ్వాలియర్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా భర్తలు కొట్టారని భార్యలు ఫిర్యాదు చేస్తుంటారు… కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో జరిగింది. భార్య కొట్టిందని ఓ భర్త ఫిర్యాదు చేశాడు. కంట్లో Chili powder పోసి మరీ కొట్టిందని.. ఆమె నుంచి కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అత్తింటి వారితో వేగలేక పోతున్నానని.. దయచేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ సింగ్ కు గ్వాలియర్ లోని మహల్ గావు ప్రాంతానికి చెందిన పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. సంజయ్ మలాన్ పూర్ లోని ఓ ఫ్యాక్టరీలో ప్లంబర్ గా పని చేసేవాడు. పెళ్లయిన కొన్నిరోజుల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత క్రమంగా విభేదాలు తలెత్తాయి. అత్తింటి వారిని పూజ అసలు గౌరవించేది కాదట.. ఇంట్లో పనులు కూడా చేసేది కాదట.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదట.

ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం సంజయ్ ఉద్యోగం కోల్పోయాడు.  ఆ తరువాతే గొడవలు మరింత పెరిగాయి.ఈ క్రమంలో మే 31 సంజయ్ తల్లిదండ్రులను పూజా తిట్టింది. మీ పేరెంట్స్ మంచివారు కాదు అనడంతో సంజయ్ కి కోపం వచ్చింది. భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని తిట్టాడు. ఆ తర్వాత పూజను  గ్వాలియర్ లోని తన పుట్టింట్లో దింపడానికి వెళ్ళాడు. సంజయ్ తన అత్తింటికి వెళ్ళాక గొడవ మరింత పెద్దదయింది. తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి సంజయ్ పై దాడి చేసింది పూజ. సంజయ్ ను ఇటుకలతో కొట్టడమే కాకుండా.. కంట్లో కారం చల్లారు. అందరూ కలిసి సంజయ్ ను చితకబాదారు. 

ఈ ఘటన తర్వాత అతను నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన భార్య కంట్లో కారం పోసి కొట్టింది అని.. ఆమె నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులను విచారిస్తున్నారు. ఒకవేళ వారు తప్పు చేశారని తేలితే... కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Thalapathy Vijay Grand Convoy: సీఎం విజయ్ కాన్వాయ్ చూస్తేమతిపోవాల్సిందే | Asianet News Telugu
స్పీచ్ అదరగొట్టిన తలపతి | Thalapathy Vijay Swearing-in Ceremony | Asianet News Telugu