వీడు మామూలోడు కాదు.. 20 సెకన్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ తాళాన్ని పగలగొట్టి.. దొంగతనం.. షాకవుతున్న నెటిజన్స్...

Published : Mar 16, 2022, 08:23 AM IST
వీడు మామూలోడు కాదు.. 20 సెకన్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ తాళాన్ని పగలగొట్టి.. దొంగతనం.. షాకవుతున్న నెటిజన్స్...

సారాంశం

ఓ దొంగ పోలీసుల్నే కాదు.. నెటిజన్లనూ ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు. 20 సెకన్లలో హ్యాండిల్ లాక్ ను ఓపెన్ చేసి నిమిషంలో బైక్ స్టార్ట్ చేసుకుని దర్జాగా వెళ్లిపోయే అతని హస్తలాఘవం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గ్వాలియర్‌ : madhya pradeshలో Royal Enfield బైక్‌లను (బుల్లెట్‌) నిముషం వ్యవధిలో దొంగతనం చేస్తున్న ఇద్దరు యువకులను నగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అంతేకాదు వారు theft ఎలా ఎంత ఈజీగా చేస్తారో పోలీసులకు demo చేసి చూపించారు. ఆ యువకుల చాకచక్యానికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. 

66 కళల్లో చోరకళ కూడా ఒకటి. దాన్ని ఇదిగో ఇలాంటి యువకులను చూసే చెప్పి ఉంటారు. సెకన్లలో లాక్ వేసి ఉన్న బైక్ ను కొట్టేసి.. నిమిషంలో బండితో సహా మాయమైపోవడం వీళ్ల ప్రత్యేకత.

పోలీస్ స్టేషన్ లో డెమో చేస్తున్నప్పుడు పోలీసులు దీన్నంతా వీడియో తీశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్వాలియర్ నగరంలోని డీడీ నగర్ ప్రాంతంలో తాము కొట్టేసిన బుల్లెట్‌ను దాచేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వస్తున్నారని తెలిసింది. దీంతో అక్కడి పోలీస్ ఇన్‌ఫార్మర్‌ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో వెంటనే పోలీసులు అలెర్ట్ అయి రంగంలోకి దిగారు. 

ఆ తర్వాత సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిఎస్‌పి) రవి భడోరియా బృందంగా ఏర్పడి వారిని పట్టుకునేందుకు డీడీ నగర్ ప్రాంతంలో తమ బలగాలతో మోహరించారు. యువకులు బుల్లెట్ తో అక్కడికి చేరుకోగానే పోలీసు బృందం చుట్టుముట్టి పట్టుకున్నారు.

యువకులను మోరెనా జిల్లాకు చెందిన శ్యామ్ గుర్జార్, బజ్నా గురాజ్‌లుగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మూడు బైక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు మంచి ధర రావడంతో వాటిని మాత్రమే దొంగిలిస్తున్నామని వారు విచారణలో పోలీసులకు తెలిపారు.ఇద్దరు యువకులను అరెస్టు చేశామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని భదౌరియా చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood