
పంజాబ్ : జీవితంలో జరిగిన సంఘటనలే సినిమాల్లో కనిపిస్తాయా? సినిమాల్లో కనిపించినవే జీవితంలో జరుగుతాయా? అంటే సమాధానం సరిగా రాదు. అయితే అచ్చం మన్మథుడు సినిమాలో లాంటి సంఘటనే నిజ జీవితంలో జరగడంతో అందరూ షాక్ తిన్నారు.
మన్మథుడు సినిమాలో హీరో నాగార్జున, బ్రహ్మానందం ఓ చెప్పుల షాపులో బూట్లు కొని.. ట్రయల్ వేస్తామని చెప్పి పారిపోతారు. ఈ సీన్ హిలేరియస్ గా ఉంటుంది. అలాంటిదే సేమ్ టు సేమ్ పంజాబ్ లో జరిగింది.
పంజాబ్ లోని జలంధర్ లో ఓ జంట బైక్ తో సహా పరారయ్యింది. వారు వెనక్కి తిరిగి వస్తారని చూస్తూ కూర్చున్న షాపు యజమానికి నిరాశే మిగిలింది. దీంతో అతను పోలీసులకు ఆశ్రయించాడు.
జలంధర్ లోని ‘శివ ఆటో డీల్’ షో రూం కు బుధవారం ఓ జంట బైక్ కొంటామంటూ వచ్చింది. ఆ షాప్ ఓనర్ సంజీవ్ వారికి పల్సర్ బైక్ చూపించి, దాని డిటైల్స్ అనీ వివరించాడు. వారు టెస్ట్ డ్రైవ్ చేస్తామన్నారు. అందుకు సంజీవ్ అంగీకరించాడు. దాంతో వారిద్దరూ ఆ బైక్ తీసుకుని వెళ్లారు.
అయితే వెళ్లినవారు ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో సంజీవ్ పోలీసులను ఆశ్రయించాడు. షాప్ లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. వారు తీసుకెళ్లిన బైక్ నెంబర్, వారి ఫొటోలు సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపించారు.