ముంబైలో దారుణం.. అప్పు తీర్చాల‌ని కోరినందుకు చిన్న‌నాటి స్నేహితురాలిని చంపిన యువ‌కుడు..

Published : May 01, 2022, 04:51 PM ISTUpdated : May 01, 2022, 04:52 PM IST
ముంబైలో దారుణం.. అప్పు తీర్చాల‌ని కోరినందుకు చిన్న‌నాటి స్నేహితురాలిని చంపిన యువ‌కుడు..

సారాంశం

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితురాలని మరో స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు వారి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారితీసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. 

ముంబైలో దారుణం జ‌రిగింది. తీసుకున్న అప్పు తీర్చాల‌ని కోర‌డంతో త‌న చిన్ననాటి స్నేహితురాలినే హ‌త్య చేశాడో యువకుడు. అనంత‌రం ఆ మృత‌దేహాన్ని గోనె సంచిలో కుక్కి బీచ్ లో పాడేశాడు. ఇందులో మృతురాలి వ‌య‌స్సు 18 సంవత్స‌రాలు కాగా.. నిందితుడు వ‌య‌స్సు 22 సంవత్స‌రాలు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మృతురాలిని సోనమ్ శ్రీకాంత్ సుక్లాగా, నిందితుడిని సబిద్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..  గోరేగావ్ వెస్ట్‌లోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో సోన‌మ్ శ్రీకాంత్ సుక్లా నివసిస్తోంది. పొరుగునే సబిద్ అన్సారీగా నివసిస్తున్నాడు. వారిద్ద‌రికీ చిన్నప్ప‌టి నుంచే ప‌రిచ‌యం ఉంది. వారిద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచే స్నేహితులుగా ఉన్నారు. అయితే కొంత కాలం క్రితం సుక్లా నుంచి అన్సారీ రూ. 5000 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డం లేదు. ఇదే విష‌యంలో ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం సుక్లా ఇంట్లో గొడ‌వ జ‌రిగింది. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని ఆమె హెచ్చ‌రిచింది. దీంతో నిందితుడు ఆమెకు రూ.2000 తిరిగి ఇచ్చారు. కానీ మిగితా డ‌బ్బులు కూడా కావాల‌ని ఆమె డిమాండ్ చేసింది. 

ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కోపంతో సుక్లాను అన్సారి కేబుల్ వైర్ తో గొంతు నులుమి హ‌త్య చేశాడు. మృత‌దేహాన్ని గోనె సంచిలో కుక్కాడు. అనంత‌రం అత‌డు త‌న మ‌రో స్నేహితుడికి ఫోన్ చేశాడు. స్కూటీ తీసుకొని అక్క‌డికి రావాల‌ని సూచించాడు. ఆ టూ వీల‌ర్ పై మృత‌దేహాన్ని తీసుకొని మద్ బీచ్ సమీపంలో పడేశాడు. అయితే బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. మృత‌దేహాం గురువారం పోలీసుల‌కు ల‌భించింది. 

‘‘ మాకు గురువారం ఉదయం వెర్సోవా నుండి మృతదేహాన్ని లభించింది. మృత‌దేహం ఉన్న గోనె సంచి కేబుల్ వైర్‌తో కట్టివేసి ఉంది. మేము సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించాము. ఆ గోనె సంచిని తీసుకెళ్తున్న ఓ వ్య‌క్తిని గుర్తించాము. అత‌డిని ట్రేస్ చేసి శనివారం రాత్రి ఆలస్యంగా అరెస్టు చేసాము. ’’ అని వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ సిరాజ్ ఇన్మాదర్ మీడియాకు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !