మత్తుమందిచ్చి యువతిపై అత్యాచారం... వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు

Arun Kumar P   | Asianet News
Published : Jan 30, 2022, 07:57 AM ISTUpdated : Jan 30, 2022, 08:04 AM IST
మత్తుమందిచ్చి యువతిపై అత్యాచారం... వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు

సారాంశం

సోషల్ మీడియాలో పరిచమైన యువకుడి చేతిలో దారుణంగా మోసపోయిందో యువతి. మాయమాటలు నమ్మి  అతడితో వెళ్ళిన పాపానికి ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు గురవుతోంది. 

 పంజాబ్: సోషల్ మీడియా (social media)లో అపరిచితులతో స్నేహం చేసి గుడ్డిగా వారిని నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ దారుణ ఘటన తెలియజేస్తుంది. ఓ యువతి సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి మాయమాటలు నమ్మి స్నేహం చేస్తే దీన్ని అలుసుగా తీసుకుని అతడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు యువతిపై అత్యాచారం చేస్తుండగా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసి రాక్షసానందం పొందాడు. ఈ ఘటన పంజాబ్ (PUNJAB) రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... పంజాబ్ లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన విశాల్ చౌదరి(22) సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటాడు. ఈ క్రమంలోనే ఇతడికి ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. చాలారోజులు వీరిద్దరి మధ్య చాటింగ్ కొనసాగి చివరకు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకునే స్థాయికి చేరింది స్నేహం. ఇలా బాలికకు తరచూ ఫోన్ చేసి మాయమాటలు చెప్పేవాడు విశాల్. దీంతో బాలిక అతడిపై పూర్తిగా నమ్మకాన్ని పెంచుకుంది. 

ఈ సమయంలోనే విశాల్ తన రాక్షస రూపాన్ని బయటపెట్టాడు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని కలుద్దామని చెప్పి విశాల్ పిలిపించుకున్నాడు. గతంలో అతడి ప్రవర్తన బాగానే వుండటంతో బాలికకు ఎలాంటి అనుమానం కలగలేదు. 

ఇలా బాలికను తన ఇంట్లోకి ఆహ్వానించిన విశాల్ ముందుగానే ప్లాన్ చేసుకుని శీతలపానియంలో మత్తుమందు కలిపి పెట్టాడు.  ఈ కూల్ డ్రింక్ ను బాలికతో తాగించాడు. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీసాడు. బాలిక స్పృహలోకి వచ్చాక తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించగా ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బెదిరించాడు. దీంతో  బయపడిపోయిన యువతి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 

బాలిక మౌనాన్ని అలుసుగా తీసుకున్న విశాల్ వీడియో బయటపెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఏడాది కాలంగా దుర్మార్గుడి చేతిలో వేధింపులకు గురవుతూ విసిగిపోయిన యువతి తాజాగా అతడిని ఎదిరించింది. దీంతో ఈ దుర్మార్గుడి యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

ఈ అత్యాచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోలీసుల వరకు చేరింది. దీంతో చబ్బేవాల్ పోలీసులు సాంకేతిక సాయంతో ఈ వీడియోను అప్ లోడ్ చేసింది విశాల్ గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నాడు. వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇదిలావుంటే  గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కస్తూర్బా నగర్‌లోని వివేక్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి గురైన 20ఏళ్ల యువతిపై కొందరు మహిళలు దాడి చేసి చిత్ర హింసలకు గురిచేశారు. ఆ యువ‌తికి జ‌ట్టు క‌త్తిరించి.. ముఖానికి నల్ల రంగు రుద్దారు. ఆపై యువ‌తి మెడ‌లో చెప్పులదండ వేసి.. వీధిలో ఊరేగించారు. ఈ త‌రుణంలో విక్ష‌ణ ర‌హితంగా యువతిపై దాడి చేశారు.  ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?