యువకుడిపై కత్తులతో కిరాతకంగా నరికి... పరువుహత్యేనా?

Published : Jan 08, 2021, 07:40 AM ISTUpdated : Jan 08, 2021, 07:45 AM IST
యువకుడిపై కత్తులతో కిరాతకంగా నరికి... పరువుహత్యేనా?

సారాంశం

సూర్య(26) అనే యువకున్ని అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు. 

 చెన్నై: తమిళనాడులోని ఆర్కాడు సమీపంలోని ముప్పదు వెట్టి పుదియ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సూర్య(26) అనే యువకున్ని అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... ఆర్కాడ్ కు చెందిన శక్తివేల్ తనయుడు సూర్య. ఇతడు రాణిపేటలో ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇతడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. చాలాకాలంగా గుట్టుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం ఇటీవలే అమ్మాయి కుటుంబసభ్యులకు తెలిసింది. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను అంగీకరించని పెద్దలు సూర్యను మందలించారు.

అయినప్పటికి సూర్య తన ప్రియురాలితో ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు గురువారం ఇంటినుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతకగా గ్రామం సమీపంలోని చెరువు గట్టు వద్ద కత్తిపోట్లకు గురై మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. ఇది ఖచ్చితంగా పరువుహత్యగా సూర్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూర్య మ్రుతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం
డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained