ప్రతి అక్షరం ముఖ్యమే.. సీఎం భార్యకు శివసేన కౌంటర్

By telugu news teamFirst Published Nov 14, 2020, 10:38 AM IST
Highlights


శివసేన  ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఐ లెటర్ తీసేసి.. ఏ అనే లెటర్ చేర్చితే.. శివసేన కాస్త.. శవసేన గా మారుతుంది అంటూ.. అమృత ఎద్దేవా చేశారు. కాగా.. ఆమె చేసిన కౌంటర్ కి ఆ పార్టీ నేతలు ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు.

మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ హీట్ పెంచుతున్నాయి. బీజేపీ, శివసేన ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఇంకా తగ్గలేదు. కాగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా.. వీలు దొరికినప్పుడల్లా శివసేనపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉంటారు. కాగా.. తాజాగా.. ఆమె శివసేనని ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశారు. కాగా.. ఆమె చేసిన కామెంట్స్ కి ఆ పార్టీ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత‌ దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇంచార్జిగా వ్యవహరించడం తెలిసిందే. కరోనా బారినపడి, ఇంటికే పరిమితం అయిపోయినా.. ఫడ్నవిస్ తనదైన చాణక్యంతో బీజేపీని నడిపించారు. ఫలితంగా బీహార్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ సీనియర్ భాగస్వామిగా ఎదిగి, జేడీయూను కమాండ్ చేసే స్థాయిలో విజయం సాధించింది. మహారాష్ట్రకే చెందిన అధికార పార్టీ శివసేన కూడా బీహార్ లో తొలిసారి బరిలోకి దిగగా.. సున్నా స్థానాలతో.. దాదాపు అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. బీహార్ లో సేన ఓటమిని ఎద్దేవా చేస్తూ ఫడ్నవిస్ భార్య అమృత అనూహ్య వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది.

శివసేన  ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఐ లెటర్ తీసేసి.. ఏ అనే లెటర్ చేర్చితే.. శివసేన కాస్త.. శవసేన గా మారుతుంది అంటూ.. అమృత ఎద్దేవా చేశారు. కాగా.. ఆమె చేసిన కౌంటర్ కి ఆ పార్టీ నేతలు ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు.

అమృత పేరులోని మొదటి అక్షరం ఏ తీస్తే.. మృతం అవుతుందని అంటే మరాఠిలో మరణంతో సమానమని శివసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎవరి పేరులో అయినా.. ప్రతి అక్షరం ముఖ్యమేనని శివసేన మహిళా పార్టీ నేత నీలమ్ గోర్హే పేర్కొన్నారు.

click me!