పాక్ దురాగతం: ఐదుగురు సైనికులు, ఆరుగురు పౌరులు మృతి

By telugu teamFirst Published Nov 14, 2020, 7:30 AM IST
Highlights

పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమించి దాడులు చేసింది. దాన్ని భారత సైనికులు ధీటుగా ఎదుర్కున్నారు. పాక్ జరిపిన కాల్పుల్లో ఐదురు సైనికులతో పాటు ఆరుగురు పౌరులు మరణించారు.

శ్రీనగర్: పాకిస్తాన్, భారత్ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు, ఆరుగురు పౌరులు మరణించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు చెప్పాయి. 

పాకిస్తాన్ కాల్పుల్లో నలుగురు సైనికులు, బీఎస్ఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ మరణించినట్లు అధికార వర్గాలు చెప్పారు. ఆరుగురు పౌరులు వేర్వేరు ప్రాంతాల్లో మరణించారు. భారత బలగాలు పాకిస్తాన్ సైనికులను తిప్పికొట్టారు. పాకిస్తాన్ వైపు కూడా పలు మరణాలు సంభవించాయి. 

ఆరేడుగురు పాకిస్తాన్ సైనికులు భారత్ ఎదురు కాల్పుల్లో మరణించారు. వారిలో ఇద్దరు స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమెండోలు ఉన్నారు. పది నుంచి 12 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సైనిక శిబిరాలపై భారత్ శతఘ్ని గుళ్లు, రాకెట్లు, ట్యాంక్ విధ్వంసం గైడెడ్ క్షిపిణులతో దాడి చేసింది. 

పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఓ పర్వత పంక్తిపై ఉనన బంకర్ విధ్వంసం కావడం వీడియోలో కనిపించింది. మరో ట్యాంక్ విధ్వంసక క్షిణపి నేరుగా ఓ బంకర్ ఢీకొట్టిన దృశ్యం కూడా మరో వీడియోలో కనిపించింది. మరి కొన్ని క్షణాల తర్వాత మరో రెండు క్షిపిణులు ఆ బంకర్ ను ధ్వంసం చేశాయి. భారత్ జరిపిన ప్రతిదాడిలో సైనిక శిబిరాలతో పాటు ఆయుధ డిపోలు, ఇంధనం డంప్ లు, ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. 

click me!