Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం

Published : Jan 06, 2026, 06:33 PM IST
Jobs

సారాంశం

2026 ప్రారంభంలో యోగి ప్రభుత్వం ఐదు జిల్లాల్లో మండల స్థాయి ఉపాధి మేళాలు నిర్వహించనుంది. ప్రైవేట్ కంపెనీల ద్వారా లక్ష మంది యువతకు ఉపాధి లభిస్తుంది. నైపుణ్యాభివృద్ధి మిషన్ ద్వారా స్థానిక ఉపాధి, వలసలను ఆపడం ప్రభుత్వ లక్ష్యం.

Uttar Pradesh : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో నడుస్తున్న ఉత్తరప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మిషన్ (UPSDM) రాష్ట్రంలో ఉపాధి కల్పనకు ఒక సమర్థవంతమైన మాద్యమంగా మారింది. నైపుణ్య శిక్షణ, పరిశ్రమల భాగస్వామ్యం, ఉపాధి మేళాల సమన్వయ నమూనా ద్వారా యోగి ప్రభుత్వం లక్షలాది మంది యువతను ఉపాధితో అనుసంధానించి స్వావలంభన దిశగా అడుగులు వేసింది.

2026 ప్రారంభంలోనే భారీ ఉపాధి మేళాలు

యోగి ప్రభుత్వ ఈ చొరవను ముందుకు తీసుకెళ్తూ 2026 సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మండల స్థాయి భారీ ఉపాధి మేళాలు నిర్వహించబోతోంది. ఈ మేళాలలో ప్రైవేట్ రంగంలోని పెద్ద కంపెనీలు పాల్గొని, సుమారు లక్ష మంది యువతకు అక్కడికక్కడే ఉపాధి కల్పిస్తాయని అధికారులు చెబుతున్నారు.

స్థానిక ఉపాధి, వలసలను ఆపడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం

రాష్ట్ర వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కపిల్ దేవ్ అగర్వాల్ మాట్లాడుతూ… యువతకు స్థానికంగా ఉపాధి కల్పించడం, వలసలను నివారించడం, రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం యోగి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణను రూపొందిస్తున్నామని, తద్వారా శిక్షణ తర్వాత యువతకు ನೇరుగా ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.

ప్రతి ఉపాధి మేళాలో 100 కంపెనీలు, 20 వేల నియామకాల లక్ష్యం

ఈ నెలలో జరిగే ప్రతి ఉపాధి మేళాలో సగటున 100 కంపెనీలు పాల్గొంటాయని మంత్రి చెప్పారు. ప్రతి మేళాలో సుమారు 20 వేల మంది యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా ఐదు ఉపాధి మేళాల ద్వారా మొత్తం లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు.  

186 ఉపాధి మేళాలతో 4.32 లక్షల మంది యువతకు ఉద్యోగాలు

2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లా, మండల స్థాయిలో 186 భారీ ఉపాధి మేళాలు నిర్వహించారు. ఈ ఉపాధి మేళాల ద్వారా 4.32 లక్షల కంటే ఎక్కువ మంది యువతకు ఉపాధి లభించింది, ఇది యోగి ప్రభుత్వ ఉపాధి-కేంద్రీకృత విధానాల విజయాన్ని చూపుతుంది.

గ్రామీణ యువత కోసం ప్రత్యేక ఉపాధి వ్యూహం

యోగి ప్రభుత్వం గ్రామీణ యువతను ఉపాధితో అనుసంధానించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద నిర్వహించిన 1,624 ఉపాధి మేళాల ద్వారా ఇప్పటివరకు 2.26 లక్షల కంటే ఎక్కువ మంది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించినట్లు మంత్రి తెలిపారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?