బృందావన్ ఆలయంలో తొక్కిసలాటకు సీఎం యోగినే కారణం: అఖిలేష్ యాదవ్

Published : Aug 29, 2022, 01:44 AM IST
బృందావన్ ఆలయంలో తొక్కిసలాటకు సీఎం యోగినే కారణం: అఖిలేష్ యాదవ్

సారాంశం

అఖిలేష్ యాదవ్: మథురలో విలేకరులతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్, గత సమాజ్‌వాదీ పార్టీ హయాంలో జన్మాష్టమిని ఘనంగా జరుపుకునేవారని, అయితే ఎలాంటి దుర్ఘ‌ట‌న‌లు జరగలేదన్నారు.  

ఉత్త‌ర‌ప్ర‌దేశ్: శ్రీకృష్ణ‌ జన్మాష్టమి రోజున మధురను సందర్శించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 20న తొక్కిసలాటకు కార‌ణ‌మ‌య్యార‌ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆదివారం నాడు మథురలో విలేకరులతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. గత సమాజ్‌వాదీ పార్టీ హయాంలో జన్మాష్టమిని ఘనంగా జరుపుకునేవారని, అయితే అలాంటి సంఘటనలు జరగలేదన్నారు. "భాజపా ప్రభుత్వంలో విషాదం జరిగింది. సీఎం యోగి దీనికి బాధ్యత వహించాలి" అని ఆయన అన్నారు.

జన్మాష్టమి నాడు మధుర పర్యటనపై ఆదిత్యనాథ్‌పై విరుచుకుపడిన అఖిలేష్ యాదవ్.. "జన్మాష్టమి నాడు కృష్ణ భక్తులు పెద్దసంఖ్యలో (మధురలో) ఉన్నారని ఆయనకు (ఆదిత్యనాథ్) తెలిసినప్పుడు, గంటల తరబడి అక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు? ప్రజలను నియంత్రించడానికి ఉద్దేశించిన పోలీసు బలగాలు అతని అక్క‌డే ఉన్నాయి. ఈ ఏర్పాట్ల కార‌ణంగా అవసరమైన ప్రదేశాలలో ఇబ్బందుల‌తో ఈ తొక్కిస‌లాట జ‌రిగింద"న్నారు. కాగా, ఆగస్టు 20వ తేదీ తెల్లవారుజామున మధురలోని బాంకీ బిహారీ ఆలయంలో జన్మాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు భక్తులు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. "బాంకీ బిహారీ ఆలయ దుర్ఘటనలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 50 లక్షలు చెల్లించాలి" అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

కాశీ విశ్వనాథ దేవాలయం తరహాలో బృందావన్‌ను కారిడార్‌గా మార్చాలనే చర్చలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ పవిత్ర పట్టణ పురాతన స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తారుమారు చేయకూడదని అన్నారు. ప్రధానమంత్రి పదవికి ప్రతిపక్షంలో అనేక ముఖాలు ఉన్నాయని, అయితే బీజేపీకి ఒక్కటే ఉందని ఎస్పీ చీఫ్‌ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, దేశంలో ప్ర‌స్తుతం పెరుగుతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు సైతం క్ర‌మంగా పెరుగుతున్న విష‌యాల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. వివాదాస్ప‌ద రైతు సాగు చ‌ట్టాల ర‌ద్దు గురించి ప్ర‌స్త్రావిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం గురించి పేర్కొంటూ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ ను గురించి పేర్కొన్నారు. “అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ వంటి పథకాల ద్వారా యువత కలలు చెదిరిపోవడం దురదృష్టకరం” అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

ఇదిలావుండగా, నోయిడాలోని సెక్టార్ 93Aలోని సూపర్‌టెక్ అక్రమ జంట టవర్లను కూల్చివేయడంతో ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి ఆదివారం నాడు అఖిలేష్ యాదవ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జంట నిర్మాణాలకు అనుమతి ఇచ్చినందుకు అఖిలేష్ యాదవ్, అతని పార్టీ, అధికారులను నిందించారు. అవినీతి భవనం నేడు కూలిపోయిందని అన్నారు. "అఖిలేష్ యాదవ్ ఆ సమయంలోని ప్రతి అధికారి ఇటువంటి అక్రమ నిర్మాణాలపై సమాధానం చెప్పాలి. ఈ అక్రమ నిర్మాణాలన్నీ అప్పటి ప్రభుత్వ రక్షణలో జరిగాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ఆయన ఆరోపించారు. ప్రజల ఆస్తులు, సంపాదనను పణంగా పెట్టి ఇటువంటి అక్రమ నిర్మాణాలను పెంచడానికి చట్టవిరుద్ధమైన మార్గాన్ని అనుసరించే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని కూల్చివేత సందేశం పంపుతుందని యూపీ బీజేపీ చీఫ్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu