సీఎంని హడలెత్తించిన ఎలుక... సమావేశం రద్దు

By telugu teamFirst Published Oct 15, 2019, 10:48 AM IST
Highlights

షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో ముఖ్యమంత్రి విధాన సౌధకు చేరుకొని ప్రసంగించాల్సి ఉంది. అయితే... ఆ గదిలో అప్పటికే ఎలుక చనిపోయి ఉంది. ఎలుక చచ్చిన కంపు గదంతా వ్యాపిస్తూ ఉంది. ఆ కంపుని చాలా సేపటి నుంచి అధికారులు భరిస్తూనే ఉన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి గదిలోకి అడిగిపెట్టారు.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ని ఓ ఎలుక హడలెత్తించింది. చచ్చిన ఎలుక కారణంగా ఆయన తన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు విధాన సౌధలో చోటుచేసుకుంది. శక్తి కేంద్రంగా పిలుచుకునే విధానసౌదలోని మూడో అంతస్తు 313 నెంబర్ హాల్ లో నిత్యం సమీక్షలు, అధికారుల కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. అదే రీతిన సోమవారం వివిధ కమిటీలతో ముఖ్యమంత్రి  యడ్యూరప్ప సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. 

ఈ సమావేశానికి అప్పటికే వివిధ కమిటీల ముఖ్యులు, సంబంధిత అధికారులు, కార్యదర్శులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో ముఖ్యమంత్రి విధాన సౌధకు చేరుకొని ప్రసంగించాల్సి ఉంది. అయితే... ఆ గదిలో అప్పటికే ఎలుక చనిపోయి ఉంది. ఎలుక చచ్చిన కంపు గదంతా వ్యాపిస్తూ ఉంది. ఆ కంపుని చాలా సేపటి నుంచి అధికారులు భరిస్తూనే ఉన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి గదిలోకి అడిగిపెట్టారు.

ఆయన ఆ గదిలో వస్తున్న కంపును భరించలేకపోయారు. వెంటనే అధికారులపై, ఆ హాల్ పర్యవేక్షకులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇంత కంపు వస్తుంటే... ఇన్ని గంటలు ఎలా కుర్చుంటారంటూ ఆయన మండిపడ్డారు. అధికారులు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినా.. ఆయన వినిపించుకోలేదు.  వెంటనే సమావేశాన్ని రద్దు చేసి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వెంటనే హాలును శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు. అనంతరం సీఎం పేషీ వద్దకు వెళ్లి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 

click me!