వంతెనను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

By telugu teamFirst Published Oct 15, 2019, 9:49 AM IST
Highlights

రెండు రోజులు క్రితం ఉత్తరా ఖండ్ లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 12మంది గాయపడ్డారు. అదుపు తప్పిన కారు 200అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది.

ఉత్తరాఖండ్ లో మంగళవారం ఉదయం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ లోని తెహ్రీ గడ్వాల్ జిల్లా నైనబాగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు వంతెనను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా రెండు రోజులు క్రితం ఉత్తరా ఖండ్ లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 12మంది గాయపడ్డారు. అదుపు తప్పిన కారు 200అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది. ఈఘటన ఆదివారం రాత్రి…. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో జరిగింది. దేవాల్ అనే ప్రాంతం నుంచి ఘాస్ ప్రాంతానికి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మహేంద్రా మాక్స్ కారులో 18మంది వెళ్తున్నారు. ప్రమాద వశాత్తు అదుపుతప్పిన వెహికిల్ 200అడుగుల లోయలో పడిపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు, విపత్తునిర్వహణ అదికారులకు సమాచారం అందించారు.

చమోలీ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి మాట్లాడుతూ… 200అడుగుల లోతు లోయలో పడిపోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయని, 8మంది మృతి చెందారని చెప్పారు. ప్రమాదం జరిగిన 20నిమిషాలలోపు పోలీసులు, ఆంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. క్షతగాత్రులనందరినీ స్థానిక హాస్పిటల్ కు తరలించామని చెప్పారు.
 

click me!