మోడీ పుట్టిన రోజు: భార్య యశోదాబెన్ పూజలు

By narsimha lodeFirst Published Sep 17, 2019, 11:14 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ సతీమణి యశోధాబెన్ కళ్యాణేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు కళ్యాణేశ్వరీ ఆలయంలో యశోధాబెన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఈ పూజలు నిర్వహించినట్టుగా ప్రచారం సాగుతోంది.

కళ్యాణేశ్వరీ ఆలయం బెంగాల్ రాష్ట్రానికి సరిహద్దులో ఉంటుంది. జార్ఖండ్ రాష్ట్రానికి ముఖద్వారంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది.ఈ ఆలయాన్ని రాజ లక్ష్మణ్ సేన్ నిర్మించినట్టుగా స్థానికులు చెబుతారు. కళ్యాణేశ్వరీ కాళీ మాతకు మరో రూపంగా పిలుస్తారు.

రాజా లక్ష్మణ్ సేన్ ఓ యుద్దంలో దాదాపుగా ఓటమి దశలో ఉన్నాడు. ఆ సమయంలో  రాజా లక్ష్మణ్ సేన్ బార్కర్ నది మీదుగా జార్నాకు చేరుకొన్నారు. ఈ సమయంలో ఆయన హఠాత్తుగా ఓ చిన్న పిల్ల పువ్వులను కోస్తూ కన్పించింది.

ఈ యుద్ధంలో రాజా లక్ష్మణ్ సేన్ గెలవనున్నట్టుగా ఆ చిన్నారి రాజుతో చెప్పింది. అంతేకాదు జార్నా నది పక్కనే కళ్యాణేశ్వరీ పేరుతో గుడిని నిర్మించాలని  కూడ ఆమె చెప్పింది. పంచకోట్ రాజా లక్ష్మణ్ ఈ యుద్ధంలో విజయం సాధించాడు.దీంతో ఆయన వెంటనే అక్కడ కళ్యాణేశ్వరీ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ప్రాంతంలో ఇంకా  కాళీమాత సంచరిస్తుందని స్థానికులు నమ్ముతారు.

కళ్యాణేశ్వరీ ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ధన్‌బాధ్ లో యశోధాబెన్ చిన్న పిల్లల విద్య కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.యశోధాబెన్ ఈ ఆలయాన్ని సందర్శించిన సమయంలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ కూడ రాలేదు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆమెకు స్వాగతం పలికారు.

కళ్యాణేశ్వరీ ఆలయంలో రూ. 201లతో యశోధాబెన్ ప్రత్యేక పూజ నిర్వహించినట్టుగా ఆలయవర్గాలు తెలిపాయి. ఇదే ప్రాంగణంలో ఉన్న శివుడి ఆలయానికి అభిషేకం చేసి రూ. 101 లను దక్షిణగా ఇచ్చారు.శుభాంకర్ దియోగార్గియా, బిల్ట్ ముఖర్జీయాలు యశోధా బెన్ కు పూజ నిర్వహించారు. 
యశోదాబెన్ వెంట ఆశోక్ మోడీతో పాటు ఆమె పర్సనల్ సెక్రటరీ అనూజ్ శర్మ కూడ ఉన్నారు. 

ఈ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ భార్య యశోధా బెన్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం తనకు థ్రిల్లింగ్ కలిగించిందని ఆలయ పూజారి బిల్ట్ ముఖర్జీ చెరప్పారు. కళ్యాణేశ్వరీ ఆలయానికి రాకముంద  బిటాతీ రామరాజు  ఆలయంలో ఆమె పూజలు నిర్వహించారు. ఆమెకు స్థానిక ఎమ్మెల్యే మహతితో పాటు ఆయన భార్య సాబిత్రిదేవీ స్వాగతం పలికారు.

click me!