Wrestlers Protest: రెజ్లర్లకు యోగా గురు రామ్‌దేవ్ మ‌ద్ద‌తు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫైర్

By Mahesh RajamoniFirst Published May 27, 2023, 11:43 AM IST
Highlights

New Delhi: రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను జైలులో పెట్టక తప్పదనీ, ఆయ‌న‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సిగ్గుచేటని యోగా గురు బాబా రామ్‌దేవ్ అభివర్ణించారు. గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లకు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌న సోద‌రీమ‌ణులు, కుమార్తెల‌పై బ్రిజ్ భూషణ్ సింగ్ మాట్లాడుతున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 

Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను జైలులో పెట్టక తప్పదనీ, ఆయ‌న‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సిగ్గుచేటని యోగా గురు బాబా రామ్‌దేవ్ అభివర్ణించారు. గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లకు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌న సోద‌రీమ‌ణులు, కుమార్తెల‌పై బ్రిజ్ భూషణ్ సింగ్ మాట్లాడుతున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. జంతర్ మంతర్ వద్ద కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు యోగా గురువు రాందేవ్ బహిరంగంగా మద్దతు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను జైల్లో పెట్టాలని రాందేవ్ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, దేశంలోని రెజ్లర్లపై వేధింపుల ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారిని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మ‌న తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల గురించి ప్రతిరోజూ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న న‌డుచుకుంటున్న తీరును చాలా ఖండించదగిన దుర్మార్గమైన చర్యగా, పాపంగా రాందేవ్ బాబా పేర్కొన్నారు.

మూడు రోజుల యోగా శిబిర్ కోసం రాజస్థాన్‌లోని భిల్వారాకు వచ్చిన రాందేవ్ బాబా, బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ ఐఆర్ నమోదైన తర్వాత కూడా అరెస్టు చేయకపోవడంపై ప్రశ్నించగా, "నేను స్టేట్ మెంట్ మాత్రమే ఇవ్వగలను. నేను అత‌న్ని జైల్లో పెట్ట‌లేను క‌దా" అంటూ వ్యాఖ్యానించారు. "రాజకీయంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలను. నేను మేధోపరంగా దివాళా తీయలేదు. తాను మానసికంగా, మేధోపరంగా వికలాంగుడిని కాదనీ, దేశం కోసం తనకు విజన్ ఉందని" యోగా గురువు తెలిపారు.

తాను రాజకీయ కోణంలో ప్రకటనలు చేసినప్పుడు ఈ విషయం కాస్త గందరగోళంగా మారుతుందనీ, ఉరుములు-మెరుపులు మాదిరి మిన్నంటాయని గతంలో తన వ్యాఖ్యలతో తరచూ మీడియా దృష్టిని ఆకర్షించిన రాందేవ్ అన్నారు. కాగా, బీజేపీ అగ్ర‌నేత‌లు త‌న‌ను రాజీనామా చేయ‌మ‌ని కోరితే వెంట‌నే ఆ ప‌నిచేస్తాన‌ని బ్రిజ్ భూష‌న్ శ‌ర‌ణ్ సింగ్ తెలిసారు. తాను 6 సార్లు ఎంపీని, తన భార్య ఎంపీ, తన కొడుకు కూడా ఎమ్మెల్యేనని పేర్కొన్నారు. 

రెజ్ల‌ర్ల హెచ్చ‌రిక‌లు 

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి  రెజ్లర్లు దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో దేశంలోని పలు ప్రాంతాలను పర్యటింస్తున్నారు. బజ్‌‌రంగ్‌‌ పూనియా, వినేశ్‌‌ ఫోగట్‌‌ హర్యానా, పంజాబ్‌‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 28న మహిళా మహాపంచాయత్‌‌ ఏర్పాటు చేయనున్నామనీ, ఆ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే.. రెజ్లర్ బజ్‌‌రంగ్‌‌ హర్యానాలోని జింద్‌‌కు చేరుకోగా, సాక్షి మాలిక్‌‌ ఆమె భర్త సత్యవర్త్‌‌ కడియాన్‌‌ పంజాబ్‌‌లో పర్యటిస్తున్నారు. నూతన పార్లమెంట్‌‌ భవన ప్రారంభోత్సవం ముందు భారీ ఎత్తున ధర్నా చేసేందుకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సంగీతా ఫోగట్‌‌, వినేష్ ఫోగట్ లు జంతర్‌‌ మంతర్‌‌ వద్ద దీక్ష కొనసాగిస్తున్నది.

click me!