పెళ్లిమండపం నుంచే వరుడు వర్క్ ఫ్రం హోం.. వీడియో వైరల్...

Published : Jul 24, 2021, 04:25 PM IST
పెళ్లిమండపం నుంచే వరుడు వర్క్ ఫ్రం హోం.. వీడియో వైరల్...

సారాంశం

వరుడు లాప్ టాప్ లో పనిచేస్తుండగా బంధుమిత్రులు అది చూసి నవ్వుకుంటున్నారు.  ఇక వధువు అయితే పగలబడి నవ్వుతోంది.  ఈ వీడియో దుల్హనియా అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చింది. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచమంతా కొన్నాళ్లు ఇంటి నుంచి పని చేసే విధానం అమలులో ఉంది. ప్రస్తుతం కరోనా కొంత అదుపులోకి రావడంతో పలు రంగాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం ఇంకా వర్క్ ఫ్రం హోం విధానంలోనే విధులు నిర్వహిస్తున్నారు.

పైగా కరోనా మూడో దశ వ్యాప్తి వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో మరి కొన్నాళ్ళు  ఇంట్లో నుంచి పనిచేయనున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం తో ఎన్ని లాభాలు ఉన్నా అనేసి కష్టనష్టాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ వీడియో... మండపంలో పెళ్లి పీటలపై కూర్చుని వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుడు లాప్ టాప్ లో పనిచేస్తుండగా బంధుమిత్రులు అది చూసి నవ్వుకుంటున్నారు.  ఇక వధువు అయితే పగలబడి నవ్వుతోంది.  ఈ వీడియో దుల్హనియా అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చింది.  ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.  వర్క్ ఫ్రం హోమ్ అంటే మామూలు కాదని ఆ కష్టం తెలిసి వారు కామెంట్ చేస్తున్నారు.

 వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేయ్ అని సలహా ఇస్తున్నారు. అయితే అతడు తన పెళ్లిని  వర్చువల్ గా బంధువులు చూసేందుకు కెమెరాలు సెట్ చేస్తున్నాడని తెలిపారు.  ఏది ఏం చేసినా అతడు చేసిన పని తెగ నవ్వు తెప్పిస్తుంది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu