మీ అబ్బాయిపై ఏ కేసు పెట్టను : ఒక తల్లికి అభయమిచ్చిన కేంద్రమంత్రి

By telugu teamFirst Published Sep 22, 2019, 9:59 AM IST
Highlights

విద్యార్థిపైన కేసు పెడితే అతని జావితం నాశనమవుతుందని భావించిన బబూల్ సుప్రియో కేసు పెట్టొద్దని పోలీసులను ఆదేశించాడు. ఈ పరిణామాలన్నిటిని అతని తల్లి చూసి ఎంతలా తల్లడిల్లుతుందో అర్థం చేసుకున్న మంత్రిగారు ఆ తల్లికి అభయమిచ్చాడు. 

మీ అబ్బాయిపై ఏ కేసు పెట్టను : ఒక తల్లికి అభయమిచ్చిన కేంద్రమంత్రి. 

కోల్ కతా : రెండు రోజుల కిందట పశ్చిమబెంగాల్ లోని జాదవ్ పుర యూనివర్సిటీలో కేంద్రమంత్రి బబూల్ సుప్రియోపై దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సీసీటీవీ ఫ్యూటేజీల ఆధారంగా ఆ జుట్టుపట్టుకుని బబూల్ సుప్రియోని లాగింది దేభంజన్ బల్లవ్ అనే విద్యార్థిగా గుర్తించారు. అతని ఫోటోలను ఏకంగా కేంద్ర మంత్రి బబూల్ సుప్రియోనే తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు. 

విద్యార్థిపైన కేసు పెడితే అతని జావితం నాశనమవుతుందని భావించిన బబూల్ సుప్రియో కేసు పెట్టొద్దని పోలీసులను ఆదేశించాడు. ఈ పరిణామాలన్నిటిని అతని తల్లి చూసి ఎంతలా తల్లడిల్లుతుందో అర్థం చేసుకున్న మంత్రిగారు ఆ తల్లికి అభయమిచ్చాడు. 

ట్విట్టర్ వేదికగా, ప్రియమైన పిన్ని గారు, శోకించకండి. మీ కుమారుడు ఏదో తెలియక చేసుంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఏ విధమైన కేసు పెట్టను. ఎవ్వరు కేసు పెట్టకుండా చూసుకుంటాను అని అన్నాడు. మంత్రిగారి ఫ్యాన్స్ ఈ విషయంలో ఆయన ఔదార్యం గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు.

click me!