భర్తకు చెల్లితో అక్రమ సంబంధం.. వాళ్లే చంపారంటూ కేసు...చివరికి ట్విస్ట్ ఏంటంటే..

Published : Jul 24, 2021, 05:01 PM IST
భర్తకు చెల్లితో అక్రమ సంబంధం.. వాళ్లే చంపారంటూ కేసు...చివరికి ట్విస్ట్ ఏంటంటే..

సారాంశం

మృతదేహాన్ని పోస్ట్ మార్టమ కు తరలించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఆ భార్యే భర్తను చంపేసి తప్పుడు కథ అల్లిందని తేలింది. 

ఛత్తీస్ గఢ్ : ‘వరసకు చెల్లి అయ్యే మహిళతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కుటుంబ సభ్యులే నా భర్తను చంపేశారు. దయచేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెయ్యండి’ అంటూ ఓ మహిళ ఈ నెల 17న ఛత్తీస్ గఢ్ లోని సనావాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది. 

మృతదేహాన్ని పోస్ట్ మార్టమ కు తరలించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఆ భార్యే భర్తను చంపేసి తప్పుడు కథ అల్లిందని తేలింది. 

సదరు మహిళ తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కోపంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఓ పథకం రచించింది. ఈ నెల 17న భర్త చేత బాగా మద్యం తాగించి అతడికి వరసకు సోదరి అయ్యే మహిళ దగ్గర అసభ్యంగా ప్రవర్తించేలా ప్రేరేపించింది. దీంతో సదరు మహిళ కోపంతో తన ఇంటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత భార్యే గొంతుకోసి చంపేసింది. 

అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త సోదరి కుటుంబంపై ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మృతుడి భార్య వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను విచారించగా ఆమె నిజం అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమె అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?