పెళ్లైందని దూరం పెట్టిన యువకుడు: కేరళలో యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి

Published : Nov 21, 2021, 12:23 PM ISTUpdated : Nov 21, 2021, 12:39 PM IST
పెళ్లైందని దూరం పెట్టిన యువకుడు: కేరళలో యువకుడిపై  వివాహిత యాసిడ్ దాడి

సారాంశం

ఓ యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు కంటి చూపును కోల్పోయాడు. వివాహితకు పెళ్లైందని యువకుడు దూరం పెట్టాడు. దీంతో ఆమె అతడిపై యాసిడ్ దాడికి దిగింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కిలో చోటు చేసుకొంది.

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పట్టణానికి చెందిన యువకుడిపై  యాసిడ్ పోసిన షీబా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా  ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. యాసిడ్ దాడితో యువకుడు కంటిచూపును కోల్పోయాడు.

idukkiలోని ఆదిమాలి ఇనుప బ్రిడ్జి వద్ద ఉన్న  చర్చి వెనుక  గత మంగళవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.  యువకుడి వెనుక నుండి వచ్చి అతడిపై యాసిడ్ పోసిందని పోలీసులు తెలిపారు.  యువకుడితో ఉన్న యువకులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  ప్రాథమిక చికిత్స పూర్తి చేసిన తర్వాత యువకుడిని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు. social media ద్వారా sheeba కు యువకుడు పరిచయమయ్యాడు. అయితే ఈ పరిచయం ఇద్దరి మధ్య loveకు దారి తీసింది.

also read:Acid Attack : పెళ్లి చేసుకోవాలని 3 పిల్లల తల్లికి వేధింపులు, వినలేదని చేతులు, కాళ్లు కట్టేసి యాసిడ్ దాడి...

అయితే అప్పటికే షీబాకు పెళ్లైందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆ తర్వాత యువకుడికి తెలిసింది. ఈ విషయం తెలిసిన యువకుడు ఆమెతో బంధాన్ని తెంచుకొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం అతడితో బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించింది. ఈ విషయాలపై మాట్లాడేందుకు ఆదిమాలికి రావాలని యువకుడిని పిలిపించింది. ఈ సమయంలోనే యువకుడిపై ఆమె యాసిడ్ దాడికి దిగింది.  ఇదిలా ఉంటే షీబాను police అరెస్ట్ చేశారు. acidదాడి చేసిన సమయంలో ఆమె చేయికి కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

బాధితుడి వాంగ్మూలం మేరకు షీబాను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.  గతంలో మహిళలపై యాసిడ్ దాడులు అనేకం చోటు చేసుకొన్నాయి. ప్రేమకు ఒప్పుకోలేదనే నెపంతో పాటు  లైంగిక వాంఛ తీర్చుకొనేందుకు సహకరించని మహిళలు, యువతులపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల యాసిడ్ దాడులు చోటు చేసుకొన్నాయి. అయితే కేరళ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా మహిళ ఓ యువకుడిపై యాసిడ్ దాడికి దిగింది. 

గతంలో దేశ రాజధాని ఢిల్లీలోని వివాహితపై ఓ వ్యక్తి వేధింపులకు గురి చేశాడు. వివాహితను కట్టేసి యాసిడ్ దాడి చేయడంతో ఆమె మరణించింది. ఈ ఏడాది నవంబర్ 3న మోంటు అనే యువకుడు  మహిళపై యాసిడ్ దాడికి దిగాడు. పెళ్లై ముగ్గురు పిల్లలున్న తనను వేధించవద్దని ఆమె ప్రాధేయపడింది. అయినా కూడా అతను వినలేదు. ఈ విషయమై భర్తకు చెప్పింది. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో వివాహితను కట్టేసి ఆమెపై యాసిడి దాడికి దిగాడు.  ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. వివాహితను పెళ్లి చేసుకొనేందుకు ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని కూడా చంపాలని నిందితుడు ఓ తుపాకిని కూడా కొనుగోలు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

TVK Government Formation: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ ఫ్యాన్స్ సంబరాలు | Asianet Telugu
TVK Vijay Assets 2026 Rs: విజ‌య్ ఆస్తులు తెలిస్తే దిమ్మదిర‌గాల్సిందే | Asianet News Telugu