ఆన్ లైన్ లో బ్రాస్ లెట్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా?

Published : Jul 03, 2023, 10:51 AM IST
ఆన్ లైన్ లో  బ్రాస్ లెట్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా?

సారాంశం

ముఖ్యంగా చాలా రకాల వెబ్ సైట్లు తక్కువ ధరకే వస్తువులు అందిస్తామంటూ ఆఫర్లు ఇస్తుంటంతో, అందరూ వాటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ బాగా నచ్చిందని బ్రాస్ లెట్ ఆర్డర్ చేసింది. అయితే, తనకు రిటర్న్ వచ్చిన ఆర్డర్ చూసి ఆమె షాకైంది.

ఈ రోజుల్లో చాలా మంది  షాపింగ్ అంటే చాలు ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారు. తీరికగా, దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయాలని అనుకోవడం లేదు. ఆన్ లైన్ షాపింగ్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చాలా రకాల వెబ్ సైట్లు తక్కువ ధరకే వస్తువులు అందిస్తామంటూ ఆఫర్లు ఇస్తుంటంతో, అందరూ వాటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ బాగా నచ్చిందని బ్రాస్ లెట్ ఆర్డర్ చేసింది. అయితే, తనకు రిటర్న్ వచ్చిన ఆర్డర్ చూసి ఆమె షాకైంది.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఐశ్వర్య ఖజురియా అనే మహిళ ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

https://www.instagram.com/reel/CuHb6zZJmrm/

 ఐశ్వర్య వాస్తవానికి వెబ్‌సైట్ నుండి సీతాకోకచిలుక బ్రాస్‌లెట్‌ను ఆర్డర్ చేసింది. తీరా ఇంటికి ఆర్డర్ వచ్చాక చూస్తే, అందులో క్రీమ్ ఉన్న ఓ జార్ ఉండటం విశేషం. ఈ విషయాన్ని ఆమె షేర్ చేయగా, ఆ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో 332k పైగా వీక్షణలు, టన్నుల కొద్దీ కామెంట్స్ రావడం విశేషం. పాపం, ఆమె పరిస్థితిని చూసి కొందరు జాలి పడుతుండగా,  చాలా మంది తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని పంచుకున్నారు. చాలా మంది తమకు ఏదో ఆర్డర్ చేస్తే, మరేదో వచ్చింది అని  కామెంట్స్ చేయడం విశేషం.
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?