మహిళ కరోనాను జయించింది, కామాంధుల చేతికి చిక్కింది

Published : Jun 02, 2021, 07:02 AM IST
మహిళ కరోనాను జయించింది, కామాంధుల చేతికి చిక్కింది

సారాంశం

అస్సాంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా నుంచి కోలుకుని కూతురితో పాటు ఇంటికి వెళ్తున్న మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

డిస్పూర్: ఓ మహిళ కరోనా వైరస్ వ్యాధిని జయించింది. అయితే కామాంధులకు బలైంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించారు. తేయాకు తోటల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. 

దుండగులు బారి నుంచి బాధితురాలి కూతురు తప్పించింది. ఈ సంఘటన అస్సాంలో జరిగింది. చారడియో జిల్లాకు చెందిన మహిళ (5)కే కాకుండా ఆమె కూతురికి (17) కూడా కరోనా సోకింది. సపేకాతి ఆస్పత్రిలో ఇరువురు చికిత్స పొందారు. కరొనా నుంచి కోలుకుని మే 29వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. 

వాహనాన్ని అమర్చుకోవడానికి కూడా డబ్బులు లేని ఆ పేదలు తేయాకు తోటల మీదుగా నడి వెళ్తుండగా చీకటి పడింది. 30 కిలోమీటర్ల దూరంలో గల తమ ఇంటికి వెళ్తుండాడగా బోర్హట్ టీ ఎస్టేట్ సమీపంలో ఇద్దరు దుండగులు వచ్చారు. తల్లీకూతుళ్లను వెంబడించారు. 

కూతురు వారి నుంచి తప్ిపంచుకుంది. తల్లి వారికి చిక్కింది. ఆమెపై దుండగులు అత్యాచారం చేశారు. పరుగెత్తుకుంటూ సమీపంలోని గ్రామానికి చేరుకున్న కూతురు విషయాన్ని అక్కడివారికి చెప్పింది. దాంతో గ్రామస్తులు తల్లి కోసం గాలించారు. పొదల మాటున నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ మహిళ కనిపించింది. గ్రామస్తులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu