కరోనా లాక్ డౌన్: క్వారంటైన్ లో ఉన్న మహిళపై అత్యాచారం

By telugu news team  |  First Published Apr 27, 2020, 7:59 AM IST

కొందరు కామాంధులు.. తమ కోరిక తీర్చుకోవడానికి ఎగబడుతున్నారు. ఒంటరిగా మహిళ కనపడితే పాపం.. తమ వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా.. క్వారంటైన్ లో ఉన్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో.. ఎవరి ప్రాణాలు పోతాయో తెలియక చాలా మంది ప్రజలు భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు కామాంధులు.. తమ కోరిక తీర్చుకోవడానికి ఎగబడుతున్నారు. ఒంటరిగా మహిళ కనపడితే పాపం.. తమ వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా.. క్వారంటైన్ లో ఉన్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాజస్తాన్‌లోని సవాయి మాధోపూర్ బటోడా పోలీసు స్టేషన్‌ పరిధిలో గత గురువారం రాత్రి  చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Latest Videos

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన ఓ మహిళ  లాక్‌డౌన్‌ కారణంగా మాధోపూర్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. నెలరోజులు అయినా లాక్‌డౌన్‌ తొలగించకపోవడంతో చివరకు చేసేదేమిలేక కాలినడకన సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె మాధోపూర్‌ చేరుకోగా, స్థానికులు అడ్డుకొని బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచారు.

ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు అర్థరాత్రి పాఠశాలకు చేరుకొని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మహిళను క్వారంటైన్‌కు తరలించి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. 

click me!