ఆఫ్ఘనిస్తాన్‌ మహిళకు బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్ష.. ముందే ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు

By Mahesh KFirst Published Oct 17, 2022, 1:06 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ మహిళా వివాహితుడితో కలిసి పారిపోయింది. ఈ నేరం చేసినందున వారిద్దరినీ చంపేయాలని తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13న భర్తను చంపేసింది. త్వరలో ఆమెను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అమలు చేయడానికి కావాల్సి ఉండగా ఆమెనే ఆత్మహత్యకు పాల్పడింది.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబాన్ల రాక్షస పాలన సాగుతున్నది. అనేక ఛాందసవాద నిబంధనలు అమలు చేస్తున్నది. ఆ నిబంధనలు అతిక్రమిస్తే అమానవీయ శిక్షలు విధిస్తున్నది. వివాహితుడితో ఓ మహిళా ఇల్లు వదిలి పారిపోయిన నేరంలో వారిద్దరినీ చంపేయాలనే శిక్ష తాలిబాన్లు వేశారు. ఆ వివాహితుడిని గురువారం చంపేశారు. సదరు మహిళను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలని శిక్ష ప్రకటించారు. ఈ శిక్ష అమలు చేయాల్సి ఉండగా సదరు మహిళ స్కార్ఫ్‌తో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు జైళ్లు లేనందున వారిని బహింగంగా రాళ్లతో కొట్టి లేదా కొరడా దెబ్బలతో చంపాలనే శిక్ష వేసినట్టు ఖామ ప్రెస్ తన కథనంలో పేర్కొంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ దేశంలో ఇల్లు వదిలి మహిళలు పారిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయనే కథనం ఒకటి వచ్చింది. దీన్ని అడ్డుకోవడానికి తాలిబాన్ ప్రభుత్వం వారిని బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపడం లేదా.. కొరడాతో కొట్టి చంపడం వంటి శిక్షలు విధించాలని నిర్ణయించింది.

Also Read: అమెరికా వదిలిపెట్టిన హెలికాప్టర్‌ను ఎగరేయాలని ప్రయత్నించి నేలకూల్చిన తాలిబాన్లు.. ముగ్గురు దుర్మరణం

ఘోర్ ప్రావిన్స్‌లో ఇటీవలే బాధితురాలు ఓ వివాహితుడితో కలిసి పారిపోయింది. ఈ నేరానికి గాను వారిద్దరినీ బహిరంగంగా చంపేయాలని తాలిబాన్లు నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన సదరు బాధితుడిని చంపేసినట్టు అధికారులు తెలిపారు. త్వరలో ఆమెకు శిక్షను అమలు చేయాల్సి ఉన్నది. కానీ, బహిరంగంగా అవమానం పొందడం కంటే అవే ప్రాణాలు తానే తీసుకోవాలని బాధితురాలి ఆలోచించినట్టు తెలుస్తున్నది.

మహిళా కారాగారాలు లేనందున ఆమెను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రొవిన్షియల్ పోలీసు చీఫ్ ప్రతినిధి అబ్దుల్ రెహ్మాన్ తెలిపారు.

click me!