పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. అర్థరాత్రి 15మంది ఇంట్లోకి దూరి.. సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్..

Published : Sep 12, 2022, 10:05 AM IST
పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. అర్థరాత్రి 15మంది ఇంట్లోకి దూరి.. సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్..

సారాంశం

తన కోరిక తీర్చడానికి ఒప్పుకోలేదని ఓ మహిళను 15మందితో కలిసి కిడ్నాప్ చేశాడు ఓ దుర్మార్గుడు. చివరికి పోలీసులకు విషయం తెలియడంలో అరెస్ట్ అయ్యాడు. 

తమిళనాడు : ఓ మహిళను 15 మంది కలిసి కిడ్నాప్ చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు గేటు బద్దలు కొట్టి మరీ మహిళను ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకుని మహిళను కాపాడారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మైలాడుతురైలో నివసించే ఓ యువతి (24)తో నిందితుల్లో ఒకరైన విఘ్నీశ్వరన్ కు కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో విఘ్నీశ్వరన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు.  

ప్ర‌ధాని బ‌హుమ‌తులు వేలం.. ‘నమామి గంగే మిషన్’కే కేటాయించనున్న ఆదాయం

దీంతో,  బాధితురాలు..  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆ తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా,  అనంతరం.. వ్రాతపూర్వకంగా లేఖ రాయించుకుని విగ్నేశ్వరన్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో బయటికి వచ్చిన విఘ్నేశ్వరన్.. యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో నిందితుడు మరో 14 మందితో కలిసి మహిళను కిడ్నాప్ చేశారు. 14మంది కలిపి ఆమె ఇంటి గేటును బద్దలు కొట్టి మరీ.. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను సిటీ దాటిస్తుండగా రంగంలోకి దిగిన పోలీసులు.. వెంబడించి హైవేపై వారిని పట్టుకున్నారు. ఆమెను విడిపించి.. ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు 

 

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM