తల్లీకొడుకుల కిడ్నాప్: మహిళపై గ్యాంగ్‌రేప్, ఇద్దరినీ నదిలోకి విసిరేసిన కామాంధులు

Siva Kodati |  
Published : Oct 11, 2020, 08:50 PM IST
తల్లీకొడుకుల కిడ్నాప్: మహిళపై గ్యాంగ్‌రేప్, ఇద్దరినీ నదిలోకి విసిరేసిన కామాంధులు

సారాంశం

ఓ వైపు దేశం మొత్తం హత్రాస్ హత్యాచార ఘటనలో నేరస్థులకు శిక్షపడాలని నిరసనలు చేస్తుంటే మరోవైపు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా బీహార్‌లో మరో దారుణం జరిగింది.

ఓ వైపు దేశం మొత్తం హత్రాస్ హత్యాచార ఘటనలో నేరస్థులకు శిక్షపడాలని నిరసనలు చేస్తుంటే మరోవైపు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా బీహార్‌లో మరో దారుణం జరిగింది.

మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదేళ్ల చిన్నారితో సహా ఆమెను నదిలోకి తోసేశారు. బక్సర్‌ జిల్లా ఒజా బరోన్ గ్రామానికి చెందిన మహిళ, తన ఐదేళ్ల కుమారుడితో కలిసి బ్యాంకుకు వెళ్తుండగా దుండగులు వారిని అపహరించారు. 

అనంతరం మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం బాధితురాలిని ఆమె కుమారుడిని తాళ్లతో కట్టేసి నదిలో విసిరివేశారు. మహిళ అరుపులు విన్న స్ధానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా, బాలుడిని మాత్రం రక్షించలేకపోయారు.

నీటి ఉద్ధృతికి ఆ చిన్నారి మరణించడం గ్రామంలో విషాదం నింపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..