ఆలయం నుంచి మహిళను జుట్టు పట్టుకున్ని బయటకు ఈడ్చుకెళ్లారు.. ఎందుకంటే? (వీడియో)

Published : Jan 06, 2023, 07:47 PM IST
ఆలయం నుంచి మహిళను జుట్టు పట్టుకున్ని బయటకు ఈడ్చుకెళ్లారు.. ఎందుకంటే? (వీడియో)

సారాంశం

బెంగళూరులోని ఓ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఓ మహిళను జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకువచ్చారు. తాను వెంకటేశ్వరుడి భార్యను అని, అతని విగ్రహం పక్కన కూర్చుంటానని పట్టుబట్టడంతో అర్చకులు అడ్డుకున్నారు. ఇలా వారించడంతో వారిపై ఆమె ఉమ్మివేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి ఆమెను బయటకు ఈడ్చుకెళ్లాడు.  

బెంగళూరు: కర్ణాటకలోని ఓ వెంకటేశ్వర ఆలయం నుంచి మహిళను ఈడ్చుకెంటూ బయటకు తీసుకెళ్లారు. వెంకటేశ్వర స్వామికి తాను మరో భార్యను అని పేర్కొంటూ విగ్రహం పక్కన కూర్చోవడానికి పట్టుబట్టిన ఆ మహిళను ఆలయ పురోహితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ పురోహితుడిపై ఉమ్మివేసింది. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. మధ్యలో ఆమె అతడిని ప్రతిఘటించి ఆపగానే అతడు ఆమెను చేతితో కొట్టడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కూడా ఆమెను బయటకు లాక్కెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు అయింది. డిసెంబర్ 21న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె అమృతహల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన  బయటకు వచ్చింది.

ఆలయం నుంచి దారుణంగా ఆమెను బయటకు ఈడ్చుకెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ఆమెపై దాడి చేయడానికి ఒక రాడ్‌ను వెతికి తెచ్చారు. ఆ రాడ్‌తో కొట్ట ప్రయత్నం చేశాడు. ఇంతలో మొదటి నుంచీ ఇదంతా చూస్తూనే ఉన్న ఓ పురోహితుడు అడ్డు వచ్చాడు.

Also Read: ఢిల్లీ బస్సులో బాలిక పక్కనే కూర్చుకుని హస్తప్రయోగం.. పట్టుకుని ప్రశ్నించగానే ఏడ్చేసిన వైనం.. వీడియో వైరల్

ఆమె మానసికంగా అనారోగ్యంతో ఉన్నారని స్థానికులు కొందరు చెబుతున్నారు. గురువారం ఆమె పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన బెంగళూరులోని ఓ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు