బెంగళూరు: అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం, మంటల్లో చిక్కుకున్న మరికొందరు

Siva Kodati |  
Published : Sep 21, 2021, 07:07 PM IST
బెంగళూరు: అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం, మంటల్లో చిక్కుకున్న మరికొందరు

సారాంశం

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహిళ సజీవదహనమైంది. మరికొందరు ఇతర ఫ్లాట్లలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu