అర్థరాత్రి లేడీ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఏఎస్ఐ

Published : Dec 13, 2018, 10:41 AM IST
అర్థరాత్రి లేడీ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఏఎస్ఐ

సారాంశం

డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో దారుణంగా ప్రవర్తించాడు. అసభ్యమైన మాటలతో విసిగించాడు. అతడి మాటలకు కోపంతో ఆ కానిస్టేబుల్  కుర్చీ నుండి లేవగానే ఏఎస్‌ఐ ఆమెను అసభ్యంగా తాకడం ప్రారంభించాడు. 

అర్థరాత్రిపూట విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ తో.. ఓ ఏఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో.. అతనిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి సోమరసంపేట పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమరసంపేట స్టేషన్‌లో బాలసుబ్రమణి (50) ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. రాత్రి నగరంలో గస్తీకి వెళ్లి తిరిగొచ్చిన బాలసుబ్రమణి స్టేషన్‌లోని కంప్యూటర్‌ విభాగంలో డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో దారుణంగా ప్రవర్తించాడు. అసభ్యమైన మాటలతో విసిగించాడు. అతడి మాటలకు కోపంతో ఆ కానిస్టేబుల్  కుర్చీ నుండి లేవగానే ఏఎస్‌ఐ ఆమెను అసభ్యంగా తాకడం ప్రారంభించాడు.  అతని ప్రవర్తనతో షాక్ కి గురైన ఆమె వెంటనే తేరుకొని.. అతని పై ఎదురుదాడికి దిగింది.

తన కాలి బూటుతో చెంప పగలకొట్టింది. అతను కిందపడిపోగానే.. వెంటనే అక్కడి నుంచి పరారయ్యింది. ఎంత సేపటికీ కానిస్టేబుల్ స్టేషన్‌లోకి రాకపోవడంతో ఏఎస్ఐ ఇంటికి వెళ్ళిపోయాడు. ఏఎస్‌ఐ వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న ఆ మహిళా కానిస్టేబుల్‌ వెంటనే స్టేషన్‌లోనికి వెళ్లి కంప్యూటర్‌ విభాగంలో సీసీ కెమెరాలో ఏఎస్‌ఐ తనతో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలను తన పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసు కుని వెళ్లిపోయింది. 

మంగళవారం ఉదయం ఆ వీడియో ఆధారంతో తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో ఏఎస్‌ఐ బాలసుబ్రమణిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఏఎస్‌ఐ ని సస్పెండ్‌ చేయడంతోపాటు ఆయనపై శాఖాపరం గా కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?