అన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ తెలియనట్టుగా...

Published : Jun 07, 2021, 05:10 PM IST
అన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ తెలియనట్టుగా...

సారాంశం

జూన్ 3వ తేదీ గురువారం. ఢిల్లీలోని నిహాల్ ఏరియాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని ఆ ఏరియా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హత్య జరిగిన ఇంటికి వెళ్లారు. అక్కడ అనిల్ సాహు అనే వ్యక్తి చచ్చిపడి ఉన్నాడు. అతడి శరీరం, ముఖం, తల, మెడపై గాయాలున్నాయి.

జూన్ 3వ తేదీ గురువారం. ఢిల్లీలోని నిహాల్ ఏరియాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని ఆ ఏరియా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హత్య జరిగిన ఇంటికి వెళ్లారు. అక్కడ అనిల్ సాహు అనే వ్యక్తి చచ్చిపడి ఉన్నాడు. అతడి శరీరం, ముఖం, తల, మెడపై గాయాలున్నాయి.

ఏం జరిగిందని ఆయన భార్య భువనేశ్వరి దేవిని అడిగారు పోలీసులు. భర్తను కలవడానికి ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారని, వాళ్లే ఆయన్ని చంపేసి పోయారని చెప్పిందామె. అక్కడ ఫార్మాలిటిస్ పూర్తి చేసిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. సంఘటనా స్థలంలో వారికి ఎలాంటి ఆధారం దొరకలేదు. అయితే, హత్య జరిగినప్పుడు ఆ ఇంట్లో మొత్తం ఐదుగురు ఉన్నారు. వారెవ్వరూ సంఘటనకు సంబంధించిన ఏ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. 

దీంతో పోలీసులకు అనుమానం మొదలయ్యింది. దానికి తోడు భువనేశ్వరి చేతిమీద గాయాలు, దుస్తుల మీద రక్తపు మరకలు, పొంతనలేని ఆమె సమాధానాలు మరింత అనుమానం కలిగించాయి. ఆమెను గట్టిగా విచారించేసరికి నిజం ఒప్పుకుంది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తరచుగా కొట్టేవాడని చెప్పింది. ఈ నేపథ్యంలోనే రాజ్ అనే వ్యక్తితో తను వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది. 

ఇక హత్య జరిగిన రోజు రాత్రి  ఏం జరిగిందంటే.. ముందుగా వేసుకన్న పథకం ప్రకారం భర్తకు తినే అన్నంలో భువనేశ్వరి నిద్ర మాత్రలు కలిపింది. ఆ అన్నం తిన్న అతడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే ప్రియుడు రాజ్ తో కలిసి అతడ్ని కట్టేసింది. అయితే, అనిల్ ను చంపాలనుకుంటున్న సమయంలో అతడు పైకి లేవటంతో ప్లాన్ కొద్దిగా దెబ్బతింది. అనిల్, రాజ్ ల మధ్య గొడవ మొదలయ్యింది. భువనేశ్వరి భర్త చేతుల్ని గట్టిగా పట్టుకోవటంతో రాజ్ అతడ్ని కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu