టీనేజ్ కుర్రాడిపై వివాహిత అత్యాచారం.. ఆమె భర్తకు తెలియడంతో..

Published : Jun 07, 2021, 03:15 PM IST
టీనేజ్ కుర్రాడిపై వివాహిత అత్యాచారం..  ఆమె భర్తకు తెలియడంతో..

సారాంశం

ఈ విషయం కాస్త సదరు మహిళ భర్తకు తెలిసిపోయింది. అతను ఆమెను మందలించి.. ఆ అబ్బాయికి అండగా నిలవాల్సిందిపోయి రివర్స్ అయ్యాడు.

సాధారణంగా అమ్మాయిలపై అత్యాచారాలు జరగడం లాంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం. పసిపిల్లల దగ్గర నుంచి పాడెక్కడానికి సిద్దంగా ఉన్న ముసలమ్మలను కూడా వదలనివారు ఉన్నారు ఈ సమాజంలో. అయితే.. ఈ సమాజంలో కేవలం అమ్మాయిలకు మాత్రమేకాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ లేదు. 

కొందరు కిలాడీ లేడీలు.. మగ పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ టీనేజ్ కుర్రాడిపై వివాహిత అత్యాచారానికి పాల్పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కి చెందిన ఓ 16ఏళ్ల టీనేజ్ కుర్రాడిపై ఓ వివాహిత కన్ను పడింది.  ఆమె వయసు 35ఏళ్లు కాగా.. ఆ కుర్రాడి వయసు 16ఏళ్లు. బలవంతంగా ఆ అబ్బాయిపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడింది.

అయితే.. ఈ విషయం కాస్త సదరు మహిళ భర్తకు తెలిసిపోయింది. అతను ఆమెను మందలించి.. ఆ అబ్బాయికి అండగా నిలవాల్సిందిపోయి రివర్స్ అయ్యాడు. తనకు డబ్బులు ఇవ్వాలంటూ సదరు బాలుడు, అతని కుటుంబసభ్యులను బెదిరించడం గమనార్హం.

తమకు డబ్బులు ఇవ్వకుంటే.. సదరు బాలుడే తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. డబ్బులు కాకుంటే.. భూమి అయినా ఇవ్వాలంటూ వాళ్లను బెదిరించాడు. దానికి బాలుడు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో.. వారికి సంబంధించిన బొప్పాయి తోట మొత్తం నాశనం చేస్తామని కూడా బెదిరించారు.

దీంతో.. ఏం చేయాలో పాలుపోని బాలుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు  చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.  సదరు మహిళపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు