నలుగురితో పెళ్లి, డబ్బు,నగలతో జంప్: మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లికూతురు అరెస్ట్

Published : Aug 10, 2021, 02:29 PM IST
నలుగురితో పెళ్లి, డబ్బు,నగలతో జంప్: మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లికూతురు అరెస్ట్

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలో నలుగురిని పెళ్లి చేసుకొని డబ్బులు, నగలు తీసుకొని ఉడాయించిన నిత్య పెళ్లికూతురును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి బంధువుగా చెప్పుకొని ఆమె పలువురి నుండి డబ్బులు వసూలు చేసింది. విచారణలో నిత్య పెళ్లికూతురు విషయం వెలుగు చూసింది.


చెన్నై:నలుగురిని పెళ్లిళ్లు చేసుకొని డబ్బులు, నగలు తీసుకొని ఉడాయించే నిత్య పెళ్లికూతురును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌‌కు చెందిన  సౌమ్య అనే యువతికి పెళ్లైంది. కొన్ని కారణాలతో ఆమె భర్త నుండి విడిపోయింది. ఈ సమయంలోనే ఆమె మోసాలు చేయడానికి అలవాటు పడింది. మోసం చేయడంతో వచ్చిన డబ్బుతో ఆమె  జీవితాన్ని ఎంజాయ్ చేసేది.

భర్త నుండి విడిపోయిన తర్వాత ఒకరికి తెలియకుండా మరో ముగ్గురిని ఆమె పెళ్లి చేసుకొంది. అంతేకాదు స్థానికంగా ఉన్న ఓ మంత్రి తనకు బంధువు అని ప్రచారం  చేసుకొంది. మంత్రితో చెప్పి ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి పలువురి నుండి ఆమె డబ్బులు వసూలు చేసి పారిపోయింది.మొదటి భర్త నుండి విడిపోయిన తర్వాత ఆలయళూరుకు చెందిన శక్తి అనే యువకుడిని పెళ్లి చేసుకొంది. పెళ్లైన కొన్నాలకే అతడిని మోసం డబ్బులు, నగలతో ఉడాయించింది.

ఆ తర్వాత రామనాథపురం బెటాలియన్ కు చెందిన పోలీస్  సురేష్ ను పెళ్లి చేసుకొంది.ఈ సమయంలోనే మంత్రి బంధువుగా చెప్పుకొని పలువురి నుండి డబ్బులు వసూలు చేసింది.సురేష్ ను కూడా మోసం చేసి సాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌ను ఆమె పెళ్లి చేసుకొంది. ఉద్యోగాల కోసం సౌమ్యకు డబ్బులిచ్చి మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సాలెంలో ఉన్న సౌమ్యను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే  నిత్య పెళ్లికూతురు విషయం వెలుగు చూసింది.


 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu