ప్రియుడి పురుషాంగాన్ని కత్తిరించిన యువతి....

Published : Nov 11, 2018, 10:51 AM ISTUpdated : Nov 11, 2018, 10:53 AM IST
ప్రియుడి పురుషాంగాన్ని కత్తిరించిన యువతి....

సారాంశం

ఈ ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే గొడవలు పడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వారే ప్రాణాలు  తీసుకుంటున్నారు. ఇలాంటి దారుణ సంఘటనే ఒడిషాలో చోటుచేసుకుంది. ప్రేమించిన ప్రియుడిపై ఓ మహిళ కత్తితో దాడిచేసి అతి కిరాతకంగా అతడి పురుషాంగాన్ని కత్తిరించింది.   

ఈ  ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని కియోంజర్ జిల్లా బదువాగావ్ గ్రామానికి చెందిన రాజేంద్ర నాయక్(25), కమలాపాత్ర(24) ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి కాకుండానే వీరిద్దరు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవారు. చెన్నైలో ఉద్యోగం చేసే రాజేంద్ర ఇంటికి వచ్చినప్పుడల్లా తన ప్రియురాలిని కలిసేవాడు.

అయితే రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లిన అతడు రాత్రి సమయంలో తన ప్రియురాలికి ఇంటికి వెళ్లాడు. ఏదో కారణంతో వీరిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాస్సేపటి తర్వాత రాజేంద్ర నిద్రలోకి జారుకున్నాడు. అంతకుముందు గొడవ కారణంగా కోపంతో రగిలిపోయిన కమల అతడిపై కత్తితో దాడికి పాల్పడింది. పదునైన కత్తి తీసుకుని రాజేంద్ర పురుషాంగాన్ని కత్తిరించింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజేంద్రను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌