పటియాలా గురుద్వారా ప్రాంగణంలో మద్యం సేవించిన మహిళ హత్య

Published : May 15, 2023, 01:12 PM IST
పటియాలా గురుద్వారా ప్రాంగణంలో మద్యం సేవించిన మహిళ హత్య

సారాంశం

పంజాబ్‌లోని పటియాలా గురుద్వారా ప్రాంగణంలో ఓ మహిళను కాల్చి చంపారు. ఆమె గురుద్వారా ప్రాంగణంలోనే మద్యం సేవించింది. వారించడంతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఓ సేవాదార్ ఆమెపై కాల్పులు జరిపాడు.  

ఛండీగడ్: పంజాబ్‌లో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌లోని పంటియాలాలో దుఖ్‌నివారణ్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో ఓ మహిళ మద్యం సేవించింది. ఆమెను తుపాకీతో షూట్ చేశారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆమె ప్రాణాలు నిలువలేవు.

పర్మీందర్ కౌర్ అనే మహిళ సరోవర్ సమీపంలో మద్యం సేవిస్తుండగా ఒక గురుద్వారా అటెండంట్ ఒకరు ఆదివారం సాయంత్రం ఆమెను చూశారు. అప్పుడు అటెండంట్ (సేవాదార్) సాగర్ మల్హోత్రా ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఆమెను గురుద్వారా మేనేజర్ దగ్గరకి తీసుకెళ్లాడు. అక్కడ మరో సేవాదర్ ఆమెపై కాల్పులు జరిపాడు. పర్మీందర్ కౌర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆమె మార్గ మధ్యంలోనే మరణించింది.

సాగర్ మల్హోత్రా కూడా ఆ కాల్పుల్లో గాయపడ్డాడు. ప్రస్తుతం పటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పర్మీందర్ కౌర్ డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం రాజేంద్ర హాస్పిటల్‌కు పంపించారు. 

Also Read: హాఫ్ న్యూడ్ బోల్డ్ పిక్ తో మరోసారి కస్తూరి దుమారం.. ఐదు పదుల వయసులో రెచ్చిపోతున్న సీనియర్ నటి

పర్మీందర్ కౌర్ గురుబక్ష్ కాలనీలో నివసించేది. ఆమె వివాహం చేసుకోలేదు. ఈ ఘటనపై పోలీసుల ప్రకటన ఇంకా వెలువడలేదు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu