కర్ణాటక ఎన్నికల వేళ సుమలత సంచలన నిర్ణయం.. 

Published : Mar 09, 2023, 11:04 PM IST
కర్ణాటక ఎన్నికల వేళ సుమలత సంచలన నిర్ణయం.. 

సారాంశం

ప్రముఖ నటి, మాండ్యా ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు.  

ఎన్నికల ముందు అసమ్మతి నేతలు ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి చేరడం సర్వసాధారణం. అలాగే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో బీజేపీకి కలిసోచ్చే ఓ కీలక పరిమాణం జరుగనున్నది. కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మద్దూరు తాలూకాలో నిర్మించిన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ఈ నెల 12న ప్రధాని ప్రారంభించనున్నారు.

అలాగే.. మాండ్యలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోకు ముందు బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకోనున్నది. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న సుమలత అంబరీష్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం బసవరాజు బొమ్మై ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం సుమలత అంబరీష్ తో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలత కాషాయ కండువా కప్పుకోవడం పక్కా అని, శుక్రవారం మాండ్యాలో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తారని సమాచారం. 

సుమలత బీజేపీలో చేరికపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి యాదగిరి వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. ఈ విషయాన్ని తాను నిర్ధారించలేనని, అలాగని పూర్తిగా అవాస్తమని చెప్పలేనని అన్నారు. ఈ విషయంపై స్పష్టత కోసం మరో 24 గంటలు వేచి చూడాలని సూచించారు. కొంతమందికి కొంత సొంత బలం ఉంటుందని, వారు పార్టీలో చేరితే.. అది పార్టీకి తప్పకుండా బలంగా మారుతుందని  అన్నారు.

ఎంపీ సుమలత ఒకప్పుడు పాప్యులర్ నటి. దివంగత నటుడు, రాజకీయ నాయకుడు ఎంహెచ్ అంబరీష్ భార్య. 2019 ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభకు పోటీ చేసిన ఆమె అప్పటి సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిపై 1,25,876 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో తన తర్వాతి తరం రంగంలోకి దింపాలని సీఎం హెచ్‌డీ కుమారస్వామి చేసిన ప్రయత్నం విఫలమైంది. మాండ్యా జేడీఎస్-కాంగ్రెస్‌లకు కంచుకోటగా పరిగణించబడుతుంది. సుమలత గత వారం మండ్యకు చెందిన ఎస్ఎం కృష్ణను కలిశారు. సుమలత బీజేపీలో చేరిన తర్వాత ఆమె కుమారుడికి మాండ్యా నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే సుమలత తీసుకున్న నిర్ణయం ఆమెను రిస్క్‌లో పడేసే విధంగా ఉంది. బీజేపీలో చేరడం అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆ పార్టీ ఓటు బ్యాంకుకు దూరం కావడమే.ఇది కాకుండా.. ఆమె నిర్ణయం దివంగత అంబరీష్ మద్దతుదారులను కూడా విభజించగలదు. ఈ పరిణామం కీలకంగా మారనున్నది. జేడీఎస్‌తో ఆమె ఎలాంటి అనుబంధం లేదు. అటువంటి పరిస్థితిలో, ఆమెను ఖచ్చితంగా వారు లక్ష్యంగా చేసుకుంటాడు. దీని ప్రభావం వల్ల కాంగ్రెస్,జేడీఎస్ ఓటర్లు కలిసి ఆమెను ఓడించవచ్చు. నిజానికి మాండ్యాలో ఈ ప్రజలు మెజారిటీగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సుమలత రాజకీయ జీవితం ముగిసే అవకాశం ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 

అదే సమయంలో అతని కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ముగియవచ్చని ఆందోళన చెందుతున్నారు.అదే సమయంలో బీజేపీలో చేరడం వల్ల కలిగే లాభనష్టాల గురించి సుమలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె బీజేపీలో చేరితే కుమారుడి రాజకీయ భవిష్యత్తు బీజేపీలోనే ఖాయం కావడం విశేషం. రెండవది, ఆమె బిజెపిలో చేరితే, వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆమెకు మంత్రి పదవిని బహుమతిగా ఇవ్వవచ్చని టాక్ కూడా.

మోదీ పర్యటన బీజేపీకి కీలకం

మరో 2-3 నెలల్లో జరగనున్న ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఈ పర్యటన చాలా కీలకం. మాండ్య ప్రధాన భాగమైన 'ఓల్డ్ మైసూర్' ప్రాంతంలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బీజేపీ బలహీనంగా ఉంది. మోడీ అండతో మాండ్య ప్రాంతంలో పట్టు సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఉందని, దానిని తిరిగి తీసుకురావడానికి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కమలం పార్టీ అధికారంలోకి తీసుకరావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?