Hardik Patel: బీజేపీలోకి కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు హార్ధిక్ ప‌టేల్ ..?

Published : May 30, 2022, 01:00 AM IST
Hardik Patel: బీజేపీలోకి కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు హార్ధిక్ ప‌టేల్ ..?

సారాంశం

Hardik Patel join BJP: గుజ‌రాత్ లో పటీదార్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్ధిక్ ప‌టేల్‌.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.   

Gujarat: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో కాంగ్రెస్ కు షాకిస్తూ.. అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాడు హార్ధిక్ ప‌టేల్‌. గుజ‌రాత్ లో పటీదార్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయ‌న‌.. పార్టీని వీడుతున్న క్ర‌మంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో హార్ధిక్ కాంగ్రెస్ ను వీడ‌టం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే, కాంగ్రెస్ ను వీడిన త‌ర్వాత హార్ధిక ప‌టేల్ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) లోకి వెళ్ల‌నున్నార‌నే వార్త‌లు వినిపించాయి. కాంగ్రెస్ నేత‌లు సైతం హార్ధిక్ ప‌టేల్ రాజీనామా చేస్తూ.. బీజేపీ స్క్రిప్ట్ చ‌దివారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ జోరందుకుంది. కాషాయ కండువా క‌ప్పుకోవ‌డానికి ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. 

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ మాజీ నాయకుడు హార్దిక్ పటేల్ సోమవారం బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలను ఖండించారు. అలాగే, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య నేప‌థ్యంలో  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమ‌ర్శ‌ల దాడి చేశారు. "నేను సోమ‌వారం బీజేపీలో చేరడం లేదు.. అలాంటిదేమైనా జరిగితే మీకు తెలియజేస్తాను" అని పటేల్  మీడియాకు వెల్ల‌డించారు. అలాగే, పంజాబ్ లోని ముఖ్య‌మంత్రి భగవంత్ మాన్ నాయ‌క‌త్వంలోని ఆమ్ ఆద్మీ పంజాబ్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. పటేల్ ట్వీట్ చేస్తూ "ఏ ప్రభుత్వమైనా అస్తవ్యస్తమైన చేతుల్లోకి వెళ్లడం ఎంత ఘోరమైనదో ఈ రోజు చాలా విచారకరమైన సంఘటనతో పంజాబ్ గ్రహించింది. కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడి దారుణ హత్య, ఇప్పుడు ప్రముఖ యువ కళాకారుడు సిద్ధూ మూసావాలే ను కాల్చి చంపారు.. అనేక‌ ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు" అని పేర్కొన్నారు. 

“పంజాబ్ ముఖ్యమంత్రి మరియు ఢిల్లీ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రజలు పంజాబ్‌కు బాధ కలిగించడానికి కాంగ్రెస్‌లాగా మరో పార్టీగా మారాలనుకుంటున్నారా లేదా ప్రజలకు నిజంగా ఏదైనా చేయాలనుకుంటున్నారా అని ఆలోచించాలి. సిద్ధూ మూసేవాలాకు నా నివాళి. " అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మూస్‌వాలా కాల్చి చంపబడ్డాడు. అక్కడి పోలీసులు ఇది ముఠాల మధ్య జరిగిన శత్రుత్వానికి కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. ఇదిలావుండ‌గా, పాటిదార్ కోటా ఉద్యమ నేత ఇటీవల గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి హార్ధిక్ ప‌టేల్ రాజీనామా చేశారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన పటేల్ (28)  కాంగ్రెస్ ను వీడ‌టానికి ముందు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాశారు. దేశంలోని కొన్ని కీలక సమస్యలపై పార్టీ కేవలం రోడ్‌బ్లాక్ పాత్రను మాత్రమే పోషించిందని,  ప్రతిదానిని వ్యతిరేకించడం దానిని తగ్గించిందని" పేర్కొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu