
Punjab Assembly Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకో ట్విస్ట్.. పూట పూటకో మలుపు అన్నట్టుగా సాగుతూ.. హీట్ పుట్టిస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP), ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP)లు భావిస్తుంటే.. ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేపట్టాలని అధికార కాంగ్రెస్(Congress) వ్యూహా రచన చేస్తుంది.
కానీ, ఎప్పటిలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి నేనంటే నేనంటూ పోటీ పడి ప్రకటనలిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య తీవ్ర పోటీ నెలకుంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఛన్నీవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానంపై సిద్ధూ పరోక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..
కానీ మరుసటి రోజే..సిద్దూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అధిష్టానం నిర్ణయాన్నిగౌరవిస్తాననీ, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని నవజోత్ సింగ్ సిద్దూ ప్రకటించారు. సీఎం విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. పదవుల కోసం తాను రాజకీయాల్లో లేనని, మార్పు కోసమే రాజకీయాల్లో వున్నానన్నారు. పార్టీ హైకమాండ్ మాటే నా మాట అని అన్నారు. ఇంకా, తనను హైకమండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా.. ప్రకటించకున్నా..తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకుంటే.. పంజాబ్‌లో కాంగ్రెస్ 70 సీట్లు గెలుచుకోగలదని నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు.
ఫిబ్రవరి 6న కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది? ఫిబ్రవరి 6న తేలిపోనుంది.
రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్‌లోని లూథియానాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పంజాబ్ కాంగ్రెస ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన చేయనున్నారు.
గత కొన్ని వారాలుగా, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య ప్రశ్చాన్న యుద్దం సాగింది. . ఓ రకంగా సీఎం చెన్నీ, అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయాలకు వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో సిద్దూ వ్యాఖ్యాలు చర్చనీయంగా మారాయి. ఇప్పటికే ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ.. భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 20న జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.