ప్రియుడితో భార్య సరసాలు.. భర్త మందలించాడని...

Published : Jun 20, 2020, 08:38 AM IST
ప్రియుడితో భార్య సరసాలు.. భర్త మందలించాడని...

సారాంశం

ఈ విషయం తెలుసు కున్న గోవిందరాజ్‌ భార్యను మందలించాడన్నారు. దీంతో ఆమె భర్తను హత మార్చేందుకు పథకం వేసిందన్నారు. 

ఆమె భర్తని కాదని మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడితో సరసాలు ఆడేది. చివరకు ఈ విషయం భర్తకు తెలిసిపోయింది. దీంతో ఇది మంచి పద్దతి కాదని మారాలని చెప్పి చూశాడు. అయినా ఆమె వినిపించుకోలేదు సరికదా భర్త తనను మందలించడం ఆమెకు నచ్చలేదు. దీంతో తుపాకీతో కాల్చి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపత్తూర్‌ జిల్లా నాట్రాంపల్లి సమీపంలోని పోతకుట్ట ప్రాంతానికి చెందిన టైలర్‌ గోవిందరాజ్‌ (53) ఈ నెల 4వ తేదీ జయంతిపురంలో స్పృహ కోల్పోయి ఉండగా పోలీసులు ఆయన్ను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక 15వ తేదీ మృతిచెందాడు. నాట్రాంపల్లి పోలీసులు చేపట్టిన విచారణలో ఆయన భార్య, ప్రియుడి సాయంతో హత్య చేసినట్టు తెలిసింది. 

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ... గోవిందరాజ్‌ భార్య కాంచన (40)కు అదే ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి(22)తో వివాహేతర సంబంధ ఏర్పడిందని, ఈ విషయం తెలుసు కున్న గోవిందరాజ్‌ భార్యను మందలించాడన్నారు. దీంతో ఆమె భర్తను హత మార్చేందుకు పథకం వేసిందన్నారు. కుప్పుస్వామి, ఆయన మిత్రులు ముగ్గురు కడంబూర్‌కు వెళ్లి నడికరువర్‌కు చెందిన ముత్తయ్య అనే వ్యక్తికి రూ.లక్ష అందజేసి నాటు తుపాకీ కొనుగోలు చేశారు.

 గత 4వ తేదీ రాత్రి 10 గంటలకు జయచంద్రపురంలో నడచి వెళుతున్న గోవిందరాజ్‌ను కుప్పుస్వామి తుపాకీతో కాల్చగా తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. ఈ కేసులో కాంచన, కుప్పుస్వామి, ముత్తయ్య సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌